Asia Cup Best Moments: విరాట్‌ కోహ్లి 183 నాటౌట్‌.. ఆసియా కప్‌లో బెస్ట్‌ మూమెంట్స్‌ ఇవే-asia cup best moments in india and pakistan matches ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Asia Cup Best Moments In India And Pakistan Matches

Asia Cup Best Moments: విరాట్‌ కోహ్లి 183 నాటౌట్‌.. ఆసియా కప్‌లో బెస్ట్‌ మూమెంట్స్‌ ఇవే

Hari Prasad S HT Telugu
Aug 26, 2022 02:44 PM IST

Asia Cup Best Moments: విరాట్‌ కోహ్లి 183 నాటౌట్‌తోపాటు ఆసియా కప్‌లో ఇప్పటి వరకూ ఎన్నో బెస్ట్‌ మూమెంట్స్‌ ఉన్నాయి. శనివారం (ఆగస్ట్‌ 27) నుంచి ఈ కాంటినెంటల్‌ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ మూమెంట్స్‌ ఏంటో చూసేద్దాం.

2012 ఆసియా కప్ లో పాకిస్థాన్ పై 183 రన్స్ చేసిన విరాట్ కోహ్లి
2012 ఆసియా కప్ లో పాకిస్థాన్ పై 183 రన్స్ చేసిన విరాట్ కోహ్లి (twitter)

Asia Cup Best Moments: ఆసియా కప్‌ 2022 శనివారం (ఆగస్ట్‌ 27) నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందులో ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఆదివారం (ఆగస్ట్‌ 28) వీళ్ల మ్యాచ్‌ జరగనుంది. ఐసీసీ టోర్నీలతోపాటు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై ఇండియాదే పైచేయి.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటి వరకూ ఈ రెండు టీమ్స్‌ ఆసియా కప్‌లో 14సార్లు తలపడగా.. 8 మ్యాచ్‌లలో ఇండియా గెలిచింది. ఇక ఈ ఆసియా కప్‌ చరిత్రలో ఇండియా, పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లలో కొన్ని బెస్ట్‌ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

విరాట్‌ కోహ్లి 183 నాటౌట్‌

2012 ఆసియాకప్‌ ఇండియాకు పెద్దగా కలిసి రాలేదు. అయితే ఈ టోర్నీలో రెండు మరుపురాని ఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి సచిన్‌ టెండూల్కర్‌ 100వ ఇంటర్నేషనల్‌ సెంచరీ. ఆసియా కప్‌లో భాగంగానే బంగ్లాదేశ్‌పై మాస్టర్‌ ఈ ఘనత సాధించాడు.

ఇక రెండోది పాకిస్థాన్‌పై విరాట్‌ కోహ్లి ఆడిన 183 రన్స్‌ ఇన్నింగ్స్‌. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కేవలం 148 బాల్స్‌లోనే 183 రన్స్‌ చేశాడు. ఇప్పటికీ వన్డేల్లో కోహ్లి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు ఇదే. ఈ మ్యాచ్‌లో పాక్‌ను 6 వికెట్లతో ఇండియా చిత్తు చేసింది.

హర్భజన్‌ సింగ్‌ ఆన్‌ ఫైర్‌

2010 ఆసియా కప్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌.. పాకిస్థాన్‌పై మాత్రం బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌.. టీమిండియా ముందు 272 రన్స్‌ టార్గెట్‌ ఉంచింది. చేజింగ్‌లో ఒక దశలో ఇండియా 219 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో హర్భజన్‌, రైనా 43 రన్స్‌ జోడించారు. చివరి ఓవర్లో రైనా ఔటైనా.. హర్భజన్‌ సింగ్ రెండు సిక్స్‌లతో మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌ 47వ ఓవర్లో షోయబ్‌ అక్తర్‌ బౌలింగ్‌లోనూ భజ్జీ ఓ సిక్స్‌ బాదాడు.

అఫ్రిది మెరుపులు

2014 ఆసియా కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో షాహిద్‌ అఫ్రిది మెరుపులు పాక్‌కు అనూహ్య విజయాన్ని సాధించి పెట్టాయి. మిర్పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా 245 రన్స్‌ చేసింది. 246 రన్స్‌ చేజింగ్‌లో పాకిస్థాన్‌ కూడా తడబడింది.

మహ్మద్‌ హఫీజ్‌ 75 రన్స్‌ చేసినా మిగతా వాళ్లు విఫలమయ్యారు. మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయిన పాక్‌ కష్టాల్లో పడింది. దీంతో మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకూ వెళ్లింది. ఆ ఓవర్లో 10 రన్స్‌ అవసరం కాగా.. తొలి బాల్‌కే సయీద్‌ అజ్మల్‌ ఔటయ్యాడు. కానీ అఫ్రిది మాత్రం అప్పటికే ఊపు మీదున్నాడు. స్ట్రైక్‌ దొరకగానే అశ్విన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది పాక్‌ను వికెట్‌ తేడాతో గెలిపించాడు.

WhatsApp channel

సంబంధిత కథనం