Ind vs Pak in T20s: టీ20ల్లో పాకిస్థాన్‌పై ఇండియాకు అదిరిపోయే రికార్డు-india completely dominated pakistan in t20s ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Pak In T20s: టీ20ల్లో పాకిస్థాన్‌పై ఇండియాకు అదిరిపోయే రికార్డు

Ind vs Pak in T20s: టీ20ల్లో పాకిస్థాన్‌పై ఇండియాకు అదిరిపోయే రికార్డు

Hari Prasad S HT Telugu
Aug 26, 2022 01:05 PM IST

Ind vs Pak in T20s: టీ20ల్లో పాకిస్థాన్‌పై ఇండియాకు అదిరిపోయే రికార్డు ఉంది. ఈసారి ఆసియా కప్‌ ఈ ఫార్మాట్‌లోనే జరగనుండటంతో ఇది టీమిండియాకు కలిసొచ్చే విషయమే.

<p>ఆసియా కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ కు సిద్ధమవుతున్న టీమిండియా</p>
ఆసియా కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ కు సిద్ధమవుతున్న టీమిండియా (AFP)

Ind vs Pak in T20s: ఇండియా, పాకిస్థాన్‌ మధ్య మరో క్రికెట్ సమరానికి టైమ్‌ దగ్గర పడింది. ఈ దాయాదుల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ను ఫీల్డ్‌లో జరిగే యుద్ధంగా అభిమానులు భావిస్తారు. అందులోనూ రెండు టీమ్స్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో లేకపోవడంతో ఎప్పుడో ఒకసారి ఈ టీమ్స్‌ ఇలా తలపడే అవకాశం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు.

ఆసియా కప్‌లో భాగంగా ఈ ఆదివారం (ఆగస్ట్‌ 28) ఇండోపాక్‌ వార్‌ జరగనుంది. ఈ టోర్నీలో రెండు టీమ్స్‌కు ఇదే తొలి మ్యాచ్‌. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించే టీమ్‌ కాన్ఫిడెన్స్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని రెండు టీమ్స్ భావిస్తుంటాయి.

ఇక మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో ఉండే ఒత్తిడి రెండు టీమ్స్‌కు అదనపు భారమనే చెప్పాలి. అయితే ఈసారి ఆసియా కప్‌ టీ20 ఫార్మాట్‌లో జరగనుండటం, ఇందులో ఇప్పటి వరకూ పాకిస్థాన్‌పై ఇండియానే పైచేయి సాధించడం కాస్త కలిసొచ్చేదే.

టీ20ల్లో ఇండియాదే పైచేయి

ఓవరాల్‌గా టెస్ట్, వన్డే క్రికెట్‌లో ఇండియాపై పాకిస్థాన్‌ సాధించిన విజయాలే ఎక్కువ. అయితే ఐసీసీ ఈవెంట్లు, టీ20 ఫార్మాట్లలో మాత్రం పాక్‌పై ఇండియా ఆధిపత్యం చెలాయించింది. 2007 నుంచి 2021 టీ20 వరల్డ్‌కప్‌ వరకూ ఈ రెండు దేశాలు మొత్తం 9 టీ20 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో ఏడింట్లో ఇండియా విజయం సాధించడం విశేషం.

రెండు మ్యాచ్‌లలోనే పాకిస్థాన్‌ గెలిచింది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో పది వికెట్ల విజయం అందులో ఒకటి కాగా.. మరొకటి 2012-13లలో చివరిసారి ఇండియా టూర్‌కు వచ్చినప్పుడు పాకిస్థాన్‌ బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో గెలిచింది. ఇక 2007 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఈ రెండు టీమ్స్‌ టీ20 ఫార్మాట్‌లో తలపడగా.. ఆ రెండింట్లోనూ ఇండియానే గెలిచింది.

ఇక 2012 టీ20 వరల్డ్‌కప్‌లో 8 వికెట్లతో గెలవగా.. 2012-13 టూర్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టీ20లో 11 రన్స్‌తో విజయం సాధించింది టీమిండియా. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో 7 వికెట్లతో, 2016 ఆసియాకప్‌లో 5 వికెట్లతో, 2016 టీ20 వరల్డ్‌కప్‌లో 6 వికెట్లతో ఇండియా గెలిచింది.

బ్యాటింగ్‌లో కోహ్లి.. బౌలింగ్‌లో గుల్‌

ఇక టీ20ల్లో ఈ రెండు టీమ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యధిక రన్స్‌ చేసిన ప్లేయర్‌గా విరాట్‌ కోహ్లి నిలవగా.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉమర్‌ గుల్‌ టాప్‌లో ఉన్నాడు. కోహ్లి ఇప్పటి వరకూ టీ20ల్లో పాకిస్థాన్‌పై 311 రన్స్ చేశాడు.

ఇక రెండోస్థానంలో పాక్‌ ప్లేయర్‌ షోయబ్‌ మాలిక్‌ 164 రన్స్‌తో ఉన్నాడు. బౌలింగ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉమర్‌ గుల్‌ 11 వికెట్లతో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాడు. రెండోస్థానంలో ఇండియాకు చెందిన ఇర్ఫాన్‌ పఠాన్‌ 6 వికెట్లతో ఉన్నాడు.

ఈ రెండు టీమ్స్‌ మధ్య టీ20ల్లో నమోదైన అత్యధిక స్కోరు 192 రన్స్‌. 2012-13లో చివరిసారి పాకిస్థాన్‌ .. ఇండియా టూర్‌కు వచ్చినప్పుడు అహ్మదాబాద్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండియా ఈ స్కోరు చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం