తెలుగు న్యూస్  /  Sports  /  Rohit Turns His Back On Arshdeep In Last Over And Video Goes To Viral

India vs Sri Lanka: రోహిత్‌పై నెటిజన్లు ఫైర్.. అర్షదీప్‌పై హిట్ మ్యాన్ కఠిన వైఖరి.. వీడియో వైరల్

07 September 2022, 12:35 IST

    • Rohit and Arshdeep Singh Viral: శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫీల్డింగ్ సెట్ చేయడంలో భాగంగా రోహిత్ వద్దకు వచ్చిన అర్షదీప్‌ను హిట్ మ్యాన్ అస్సలు పట్టించుకోకపోవడం విశేషం.
అర్షదీప్ సింగ్ వీడియో వైరల్
అర్షదీప్ సింగ్ వీడియో వైరల్ (Twitter)

అర్షదీప్ సింగ్ వీడియో వైరల్

Rohit turns his back Arshdeep Singh: టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్‌పై గత కొన్ని రోజులుగా నెట్టంట ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. ఆదివారం నాడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 18వ ఓవర్‌లో అతడు ప్రత్యర్థి బ్యాటర్ అసిఫ్ అలీ ఇచ్చిన సింపుల్ క్యాచ్ వదిలేయడంతో అతడిపై ఓ రేంజ్‌లో చివాట్లు పెడుతున్నారు. ఆ క్యాచ్ చేజార్చడం వల్ల తర్వాతి ఓవర్లో అతడు రెచ్చిపోయి ఆడాడు. ఫలితంగా మ్యాచ్ టీమిండియా చేతి నుంచి చేజారింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. అదే మాదిరిగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ చివరి ఓవర్ 7 పరుగులు చేయాల్సి ఉండగా.. పదునైన యార్కర్లతో మంచిగా బౌలింగ్ చేసినప్పటికీ పేలవ ఫీలింగ్ భారత్ కొంపముంచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అర్షదీప్ సింగ్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ వీడియోను గమనిస్తే.. చివరి ఓవర్ బౌలింగ్ చేసేటప్పుడు అర్షదీప్ సింగ్.. రోహిత్ శర్మ వద్దకు వచ్చి ఏదో సలహా అడిగేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించిన హిట్ మ్యాన్.. అతడు దగ్గరకు రాగానే.. ఏం పట్టనట్లు అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫీల్టింగ్ సెట్ చేయడంలో భాగంగా అర్షదీప్.. రోహిత్ వద్దకు వస్తే.. హిట్ మ్యాన్ అలా ప్రవర్తించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంది. యువ ఆటగాడైన అర్షదీప్‌తో ఇలా ప్రవర్తించడం సరికాదంటూ ట్విట్లు చేస్తున్నారు. రోహిత్ అర్షదీప్‌తో కొంచెం కఠినంగా ప్రవర్తించాడని స్పష్టం చేస్తున్నారు.

మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక విజయానికి చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా.. మొదటి నాలుగు బంతులకు ఐదు పరుగులు వస్తాయి. తనదైన యార్కర్‌తో శ్రీలంక బ్యాటర్లను నిలువరించే ప్రయత్నం చేశాడు. చివరి రెండు బంతులకు రెండు పరుగుల అవసరం కాగా.. రిషభ్ పంత్-అర్షదీప్ ఓవర్ త్రో వేయడంతో రెండు వైపులా ఆపకపోవడంతో ఐదో బంతికి రెండు పరుగులు వస్తాయి. ఫలితంగా మ్యాచ్ చేజారుతుంది.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక.. టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుశాల్ మెండిస్(57), పాథుమ్ నిశాంక(52) అర్ధశతకాలతో అదరగొట్టాగా.. కెప్టెన్ శనక(33) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీయగా.. అశ్విన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.