తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma On Ravi Shastri Comments: ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే త‌ప్పు - ర‌విశాస్త్రికి రోహిత్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

Rohit Sharma on Ravi Shastri Comments: ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే త‌ప్పు - ర‌విశాస్త్రికి రోహిత్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

09 March 2023, 8:25 IST

  • Rohit Sharma on Ravi Shastri Comments: మూడో టెస్ట్‌లో ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ వ‌ల్లే టీమ్ ఇండియా ఓట‌మి పాలైంద‌ని మాజీ కోచ్ ర‌విశాస్త్రి చేసిన కామెంట్స్‌పై రోహిత్ శ‌ర్మ స్పందించాడు. రోహిత్ ఏమ‌న్నాడంటే.

రోహిత్ శ‌ర్మ
రోహిత్ శ‌ర్మ

రోహిత్ శ‌ర్మ

Rohit Sharma on Ravi Shastri Comments: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌లో రెండు టెస్టుల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించిన టీమ్ ఇండియా మూడో టెస్ట్‌లో మాత్రం బోల్తా కొట్టింది. టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో పాటు ప్ర‌త్య‌ర్థుల‌పై ఆధిప‌త్యం చెలాయించాల‌నే ఆత్రుత మూడో టెస్ట్‌లో ఓట‌మికి కార‌ణ‌మ‌ని మాజీ కోచ్ ర‌విశాస్త్రి చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. ర‌విశాస్త్రి కామెంట్స్‌తో ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు ఏకీభ‌వించారు.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

ర‌విశాస్త్రికి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తోనే తాము మూడో టెస్ట్‌లో ఓడిపోయామ‌న్న‌ది పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని అన్నాడు. ప్లేయ‌ర్ల ఆట‌తీరు డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూస్తే ఒక‌లా ఉంటుంద‌ని అన్నాడు. బ‌య‌టి నుంచి మ‌రోలా క‌నిపిస్తోంద‌ని రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు.

ప్ర‌త్య‌ర్థికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా ప్ర‌తి మ్యాచ్‌లో దూకుడుగా ఆడ‌టానికే ప్ర‌య‌త్నిస్తుంటాం. . కొన్ని సార్లు అది వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌చ్చు. రెండు టెస్ట్‌ల త‌ర్వాత మేము విజ‌యానికి దూరం కాగానే చాలా మంది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తోనే ఓడిపోయామ‌ని కామెంట్స్ చేస్తోన్నారు. బ‌య‌టి నుంచి ఆట‌ను చూసే వారికి అలా అనిపిస్తోంది కావ‌చ్చు. కానీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి చూస్తే ఆట‌తీరు మ‌రోలా ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్ వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో, ఆట‌గాళ్ల మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ‌లు జ‌రుగుతాయో బ‌య‌టివాళ్ల‌కు తెలియ‌దు.

ప్ర‌తి గేమ్‌లో గెలుపు కోస‌మే ఆట‌గాళ్లంద‌రూ క‌ష్ట‌ప‌డుతుంటారు. వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంటార‌ని రోహిత్ శ‌ర్మ అన్నాడు. మూడో టెస్ట్‌లో ఓట‌మికి కార‌ణాలు చాలా ఉన్నాయ‌ని అన్నాడు. కానీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అన్న‌ది మాత్రం అబ‌ద్ధ‌మ‌ని తెలిపాడు. ర‌విశాస్త్రికి డ్రెస్సింగ్ రూమ్‌ల‌లో ఉండే ఆట‌గాళ్ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో తెలుసుసునంటూ రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు.