తెలుగు న్యూస్  /  Sports  /  Ravindra Jadeja Overcome Kapil Dev To Achieve Phenomenal Test Record

Jadeja Breaks Kapildev record: అదరగొడుతోన్న జడేజా.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్

11 February 2023, 6:24 IST

    • Jadeja Breaks Kapil Dev record: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా 5 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బ్యాటింగ్‌లోనూ అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా 5 వికెట్ల సహా అర్ధశతకం సాధించిన జడేజా.. ఈ విషయంలో కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు.
రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (AFP)

రవీంద్ర జడేజా

Jadeja Breaks Kapil Dev record: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపుర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ పట్టు భిగించింది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై రోహిత్ శతకంతో ఆకట్టుకోగా.. జడేజా, అక్షర్ పటేల్ అర్ధశతకాలతో రాణించడంతో 144 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. తొలి రోజు బంతితో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. రెండో రోజు బ్యాట్‌తో చెలరేగింది. హిట్ మ్యాన్ చూడముచ్చటైన శతకంతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బంతితో పాటు బ్యాట్‌తో అదరగొట్టి అద్భుత అర్ధశతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా అరుదైన ఘనత సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

తొలి రోజు బౌలింగ్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్లతో విజృంభించిన జడ్డూ.. రెండో రోజు 66 పరుగులతో అర్ధ సెంచరీతో రాణించారు. ఫలితంగా కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు. కపిల్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం నాలుగు సార్లు 5 వికెట్ల సహా అర్ధశతకం సాధించగా.. తాజాగా జడ్డూ ఆ రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌తో జడేజా ఐదో సారి ఈ గణాంకాలను నమోదు చేశాడు.

రెండో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ 120 పరుగుల అద్భుత అర్ధ సెంచరీతో టీమిండియాను పటిష్ఠ స్థితిలో ఉంచాడు. తొలి రోజు దూకుడుగా ఆడిన హిట్ మ్యాన్.. రెండో రోజు మాత్రం వేగం తగ్గించాడు. చెత్త బంతులను మాత్రమే ఆడుతూ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా పెద్దగా సంబురాలు జరుపుకోలేదు. డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ చిరునవ్వులు చిందించాడు.

ఈ మ్యాచ్‌లో ఆసీస్ 177 పరుగులకే కుప్పుకూలింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. షమీ, సిరాజ్ చెరో వికెట్‌తో ఆదిలోనే ఆసీస్‌ను దెబ్బకొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో రోజు పూర్తయ్యే సమయానికి 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(120) శతకంతో ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా(66), అక్షర్ పటేల్(52) అద్భుత అర్ధశతకాలతో రాణించారు.