తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri On Ashwin: అశ్విన్ రాణిస్తే.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ భారత్‌దే.. రవిశాస్త్రీ ఆసక్తికర వ్యాఖ్యలు

Ravi Shastri on Ashwin: అశ్విన్ రాణిస్తే.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ భారత్‌దే.. రవిశాస్త్రీ ఆసక్తికర వ్యాఖ్యలు

07 February 2023, 7:24 IST

    • Ravi Shastri on Ashwin: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ కీలకం కానున్నాడని స్పష్టం చేశారు. అతడు రాణిస్తే సిరీస్ డిసైడ్ అవుతుందని తెలిపారు.
అశ్విన్
అశ్విన్ (AP)

అశ్విన్

Ravi Shastri on Ashwin: మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియాతో భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఫలితంగా ఇరు జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే ఇరుజట్లు తొలి టెస్టు వేదిక నాగ్‌పూర్‌కు చేరుకుని ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. భారత్ ప్రధానంగా బౌలింగ్‌పై దృష్టి కేంద్రీకరించింది. బౌలర్లకు అనుకూలించే స్వదేశీ పిచ్‌లపై స్పిన్‌పై దృష్టి పెట్టింది. ఈ అంశంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ స్పందించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియాకు కీలక కానున్నాడని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"అశ్విన్‌ అతిగా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. తను అనుకున్న విధంగా బౌలింగ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అతడే కీలక ప్లేయర్. అశ్విన్ ఫామే సిరీస్‌ను డిసైడ్ చేస్తుంది. అతడు టీమిండియాకు ఓ ప్యాకేజ్ లాంటి వాడు. కీలక పరుగులు కూడా చేయగలడు." అని రవిశాస్త్రీ స్పష్టం చేశారు.

"అశ్విన్ మెరుగైన ప్రదర్శన చేస్తే సిరీస్ భారత్ తప్పకుండా గెలుస్తుంది. అతడు విదేశీ పిచ్‌లపైనే వరల్డ్ క్లాస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంక ఇండియన్ పిచ్‌ల్లో అయితే అతడో ప్రమాదకర బౌలర్. బంతి పిచ్‌పై స్పిన్ అయిందంటే చాలు, చాలా మంది బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. కాబట్టి అశ్విన్ విషయంలో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు." అని రవిశాస్త్రీ స్పష్టం చేశారు.

అశ్విన్ కాకుండా కుల్దీప్ యాదవ్‌ మూడో స్పిన్ ఆప్షన్‌గా ఉంటాడని రవిశాస్త్రీ తెలిపారు.

"మూడో స్పిన్నర్ కావాలనుకుంటే నేను కుల్దీప్ యాదవ్ పేరు సూచిస్తాను. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ ఒకే విధమైన బౌలర్లు. కానీ కుల్దీప్ మాత్రం విభిన్నం. తొలి రోజు టాస్ ఓడితే దాన్ని అధిగమించి ఆధిపత్యాన్ని చెలాయించే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తే కుల్దీప్ యాదవ్. ట్రాక్ నుంచి స్పిన్ ఎక్కువగా రాకపోతే ఆ సమయంలో కుల్దీప్ అద్భుతంగా రాణించగలడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లకు పిచ్ కఠినంగా మారడం వల్ల మణికట్టు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముంది" అని రవిశాస్త్రీ అన్నారు.