Ravi Shastri About Crickers Form: ఆటగాళ్ల ఫామ్‌పై రవిశాస్త్రీ కామెంట్స్.. గవాస్కర్, సచిన్ కూడా ఫేస్ చేశారని స్పష్టం-ravi shastri backed virat and rohit and says every players face difficult times ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ravi Shastri Backed Virat And Rohit And Says Every Players Face Difficult Times

Ravi Shastri About Crickers Form: ఆటగాళ్ల ఫామ్‌పై రవిశాస్త్రీ కామెంట్స్.. గవాస్కర్, సచిన్ కూడా ఫేస్ చేశారని స్పష్టం

Maragani Govardhan HT Telugu
Dec 03, 2022 01:16 PM IST

Ravi Shastri About Cricketers Form: క్రికెటర్ల ఫామ్ గురించి రవిశాస్త్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్, కోహ్లీ ఫామ్ లేమి కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో.. ప్రతి ఒక్కరూ ఈ దశ సహజమేనని తెలిపారు.

ఆటగాళ్ల ఫామ్ పై రవిశాస్త్రీ వ్యాఖ్యలు
ఆటగాళ్ల ఫామ్ పై రవిశాస్త్రీ వ్యాఖ్యలు (Getty Images)

Ravi Shastri About Cricketers Form: టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ గురించి గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. చాలా కాలం తర్వాత కోహ్లీ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫామ్ పుంజుకోగా.. కెప్టెన్ రోహిత్ మాత్రం పేలవ ప్రదర్శనతో పరుగులు తీయడంలో విఫమవుతున్నాడు. అతడు దీర్ఘకాలిక ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులవుతుంది. దీంతో సర్వత్రా అతడి ఫామ్ గురించి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ స్పందించారు. ఇలాంటి పరిస్థితి ప్రతి క్రికెటర్ జీవితంలో వస్తుందని, గవాస్కర్ మొదలుకుని సచిన్, ధోనీ వరకు ఎంతో మంది ఈ దశను దాటి వచ్చినవారేనని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, తెందూల్కర్, ధోనీ సహా ఎంతో మందికి ఇది విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరికీ వారి సమయం అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆటగాళ్లపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సెంటిమెంట్‌గా మారింది. ముఖ్యంగా భారతీయులమైన మనం చాలా ఆశిస్తాం. అదే సమయంలో నిలకడగా ఉండాలని కోరుకుంటాం. కానీ వారు కూడా మనుషులే. ప్రతిసారి మంచి ఇన్నింగ్స్ ఆశించలేరు. కొన్నిసార్లు మాత్రమే అలా జరుగుతుంది. తిరిగి ఫామ్ పొందుతారు. అని రవిశాస్త్రీ అన్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భాగస్వామ్యం చూసేందుకు ఎంతో బాగుంటుంది. వీరిద్దరూ వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసేందుకు మరో 86 పరుగుల దూరంలో ఉన్నారు. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనున్న తరుణంలో వీరు ఈ ఘనతను సాధించే అవకాశముంది. వన్డేల్లో విదేశాల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. మరో 39 పరుగులు చేసినట్లయితే రాహుల్ ద్రవిడ్ రికార్డు 7362 పరుగులను అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటాడు. బంగ్లాదేశ్‌పై మన రన్నింగ్ మెషిన్ 80.8 సగటును కలిగి ఉన్నాడు. ఏ దేశంపైనైనా అతడికి ఇదే అత్యధికం.

WhatsApp channel

సంబంధిత కథనం