తెలుగు న్యూస్  /  Sports  /  Ramiz Raja Shocking Comments On India If They Do Not Come Pakistan Not Part In Odi World Cup 2023

Ramiz Raja Comments on India: పాక్ లేకుండా ప్రపంచకప్ ఎవరు ఆడతారో చూస్తాం.. భారత్‌పై పీసీబీ ఛీఫ్ రమీజ్ సంచలన వ్యాఖ్యలు

26 November 2022, 17:53 IST

    • Ramiz Raja Comments on India: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా.. భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది పాక్‌లో జరగనున్న ఆసియా కప్‌లో ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తున్న వేళ.. భారత్ రాకుంటే.. తాము వన్డే వరల్డ్ కప్‌లో ఆడమని స్పష్టం చేశారు.
భారత్ పై రమీజ్ రజా సంచలన వ్యాఖ్యలు
భారత్ పై రమీజ్ రజా సంచలన వ్యాఖ్యలు

భారత్ పై రమీజ్ రజా సంచలన వ్యాఖ్యలు

Ramiz Raja Comments on India: ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగితే ఇరు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రియులు కూడా ఎంతో ఆత్రుతగా చూస్తుంటారు. ఇరు దేశాల మధ్య రాజకీయ కారణాల వల్ల ద్వైపాక్షిక సిరీస్‌లు జరగని విషయం తెలిసిదే. దీంతో ఐసీసీ ఈవెంట్లలోనే దాయాది జట్లు తలపడుతున్నాయి. దీంతో వచ్చే ఏడాది ఆసియా కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీంతో పాక్‌లో ఆడేందుకు టీమిండియా విముఖుత ప్రదర్శించింది. ఇప్పటికే ఈ అంశంపై ఇరు దేశాలకు చెందిన మాజీల మధ్య మౌత్ వార్ నడించింది. తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్ రమీజ్ రజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది పాక్‌లో జరగనున్న ఆసియా కప్‌లో భారత్ ఆడితేనే.. తాము తర్వాత ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ ఆడతామని తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ఈ అంశంలో మా నిర్ణయం మారదు. వాళ్లు(భారత జట్టు) ఆసియా కప్ కోసం వచ్చి ఆడితేనే.. అక్కడ జరగనున్న వరల్డ్ కప్‌లో మేము ఆడతాం. ఒకవేళ రాకుంటే.. పాకిస్థాన్ లేకుండా 2023 ప్రపంచకప్ జరుగుతుంది. మేము చూస్తాం పాక్ లేకుండా ఎవరెవరు ఆడతారో. ఈ విషయంలో మేము కూడా దూకుడుగానే వ్యవహరిస్తాం. మా జట్టు గత రెండేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. క్రికెట్ మార్కెట్ అత్యధిక వ్యాపారం చేస్తోన్న జట్టును ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఓడించాం. అలాగే టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ ఆడాం. పాకిస్థాన్ క్రికెట్ ఎకానమీ పెరగాలంటే మా జట్టు మంచి ప్రదర్శన చేస్తేనే సాధ్యమవుతుంది. ఈ దిశగా మేము ముందడుగు వేశాం. భారత్‌ను 2021 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆసియా కప్‌లోనూ ఓడించాం. అని పాక్ క్రికెట్ ఛీఫ్ రమీజ్ రజా" స్పష్టం చేశారు.

పాకిస్థాన్ వచ్చే ఏడాది ఆసియా కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా విముఖత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పాక్ చివరగా 2009 ఆసియా కప్‌ను హోస్ట్ చేసింది. అప్పుడు లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి సమీపంలో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరగడంతో అప్పటి నుంచి ఆ దేశంలో ఇతర జట్లు పర్యటించడానికి వెనుకాడాయి. చాలా కాలం తర్వాత 2015లో జింబాబ్వే జట్టు మూడు వన్డేల సిరీస్‌ కోసం పర్యటించింది. అనంతరం 2017లో శ్రీలంక జట్టు వన్డే సిరీస్ ఆడింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా కూడా పర్యటించింది. వచ్చేవారం అంటే డిసెంబరు 1 నుంచి ఇంగ్లాండ్.. పాక్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది.