Ramiz Raja on Ind vs Pak: ఈ ఆట చాలా క్రూరమైనది, అన్యాయమైనది: రమీజ్ రాజా-ramiz raja on ind vs pak says this game is very cruel and unfair ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ramiz Raja On Ind Vs Pak Says This Game Is Very Cruel And Unfair

Ramiz Raja on Ind vs Pak: ఈ ఆట చాలా క్రూరమైనది, అన్యాయమైనది: రమీజ్ రాజా

Hari Prasad S HT Telugu
Oct 24, 2022 02:34 PM IST

Ramiz Raja on Ind vs Pak: ఈ ఆట చాలా క్రూరమైనది, అన్యాయమైనది అంటూ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన ఇండోపాక్‌ మ్యాచ్‌పై పాక్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రాజా చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓడిన విషయం తెలిసిందే.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ పై స్పందించిన రమీజ్ రాజా
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ పై స్పందించిన రమీజ్ రాజా

Ramiz Raja on Ind vs Pak: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఉండే అసలైన మజా ఏంటో అభిమానులకు ఆదివారం (అక్టోబర్‌ 23) జరిగిన మ్యాచ్‌తో తెలిసొచ్చింది. ఎన్నో మలుపులు, నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి హీరో ఇన్నింగ్స్‌తో ఇండియా 4 వికెట్లతో గెలిచిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

చివరి ఓవర్లో 16 రన్స్‌ అవసరం కాగా.. రెండు వికెట్లు, నోబాల్‌, ఫ్రీహిట్‌కు బై రన్స్‌లాంటి ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఇండియా చివరి బంతికి గెలిచింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపిస్తూనే నోబాల్‌ వివాదంపై అంపైర్లపై మండిపడ్డారు పలువురు పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు. వీళ్లలో వసీం అక్రమ్, షోయబ్‌ అక్తర్‌, వకార్‌ యూనిస్‌లాంటి వాళ్లు ఉన్నారు.

తాజాగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛీఫ్‌ రమీజ్‌ రాజా కూడా ఈ మ్యాచ్‌పై స్పందించారు. ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. మ్యాచ్ అద్భుతంగా సాగిందంటూనే.. క్రికెట్‌ ఆట ఎంతో క్రూరమైనది, అన్యాయమైనది అని రమీజ్ అనడం గమనార్హం.

"ఇదొక క్లాసిక్‌! కొన్ని గెలుస్తాం. కొన్ని ఓడిపోతాం. అంతేకాదు మనందరికీ తెలుసు ఈ ఆట ఎంత క్రూరమైనదో, ఎంత అన్యాయమైనదో. పాకిస్థాన్‌ బ్యాట్‌, బాల్‌తో ఇంతకన్నా మెరుగైన ఆట అయితే ఆడలేదు. వాళ్ల ఆట చూసి చాలా గర్వంగా ఉంది" అని రమీజ్‌ ట్వీట్‌ చేశారు.

160 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా ఒక దశలో 31 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. సగం ఓవర్లు ముగిసే సమయానికి 45 రన్స్‌ మాత్రమే చేసింది. ఈ సమయంలో ఇండియా విజయావకాశాలు కేవలం 15 శాతం మాత్రమే అని అంచనా వేశారు. కానీ విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా జోడీ మాత్రం తమను తాము నమ్మింది. చివరికి ఇండియన్‌ టీమ్‌ అసాధ్యమనుకున్న విజయాన్ని సాధించింది.

WhatsApp channel