తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 Final | టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌.. టైటిల్‌ గెలిచేదెవరో?

IPL 2022 Final | టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌.. టైటిల్‌ గెలిచేదెవరో?

Hari Prasad S HT Telugu

29 May 2022, 19:38 IST

    • ఐపీఎల్‌ ఫైనల్‌లో భాగంగా గుజరాత్ టైటన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. తొలి సీజన్‌లోనే గుజరాత్‌ టైటిల్‌పై కన్నేయగా.. రాజస్థాన్‌ రెండోసారి టైటిల్‌ గెలిచి షేన్‌ వార్న్‌కు అసలైన నివాళి అర్పించాలని అనుకుంటోంది.
ఫైనల్ టాస్ సందర్భంగా హార్దిక్, సంజు
ఫైనల్ టాస్ సందర్భంగా హార్దిక్, సంజు (Hotstar)

ఫైనల్ టాస్ సందర్భంగా హార్దిక్, సంజు

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌. ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా రెండో క్వాలిఫయర్‌ ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నట్లు శాంసన్‌ చెప్పాడు. అటు హోమ్ గ్రౌండ్‌లో తొలిసారి ఆడుతున్న గుజరాత్‌ టైటన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడటానికి రాగానే స్టేడియం మార్మోగిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

ఈ మ్యాచ్‌కు గుజరాత్‌ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అల్జారీ జోసెఫ్‌ స్థానంలో లాకీ ఫెర్గూసన్ వచ్చినట్లు పాండ్యా చెప్పాడు. టాస్‌ గెలిస్తే తాము బౌలింగ్‌ ఎంచుకోవాలని భావించినట్లు తెలిపాడు. ఇక ఐపీఎల్‌ 2022లో ఈ టీమ్స్‌ రెండుసార్లు తలపడగా.. గుజరాతే గెలిచింది. లీగ్ స్టేజ్‌లో ఒకసారి, క్వాలిఫయర్‌ 1లో మరోసారి రాజస్థాన్‌ను గుజరాత్‌ చిత్తు చేసింది.

టాపిక్