తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Prithvi Shaw Selfie Row: క్రికెటర్ పృథ్వీ షా పై దాడి; నిందితుల అరెస్ట్

Prithvi Shaw selfie row: క్రికెటర్ పృథ్వీ షా పై దాడి; నిందితుల అరెస్ట్

HT Telugu Desk HT Telugu

16 February 2023, 22:26 IST

  • Prithvi Shaw selfie row: హోటళ్లో ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేస్తున్న క్రికెటర్ పృథ్వీ షా ను సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని అతడిపై ఒక గుంపు దాడికి పాల్పడింది. వారిలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అయిన ఒక యువతి కూడా ఉన్నారు.

క్రికెటర్ పృథ్వీ షా (ఫైల్ ఫొటో)
క్రికెటర్ పృథ్వీ షా (ఫైల్ ఫొటో) (PTI)

క్రికెటర్ పృథ్వీ షా (ఫైల్ ఫొటో)

Prithvi Shaw selfie row: హోటల్ లో సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని క్రికెటర్ పృథ్వీ షా (cricketer Prithvi Shaw) పై ఒక గుంపు దాడికి పాల్పడిందని పృథ్వీ షా (cricketer Prithvi Shaw) స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సప్న గిల్ (sapna gill) తో పాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

Prithvi Shaw selfie row:సెల్ఫీ కోసం..

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. క్రికెటర్ పృథ్వీ షా (cricketer Prithvi Shaw) కొంతమంది స్నేహితులతో కలిసి శాంతాక్రుజ్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లాడు. అక్కడ వారు డిన్నర్ చేస్తుండగా, ఇద్దరు వచ్చి సెల్ఫీ కావాలని షా ను కోరారు. వారితో షా సెల్ఫీ దిగిన తరువాత వారు మరి కొందరిని తీసుకువచ్చి, సెల్ఫీ ఇవ్వాలిన కోరారు. దానికి పృథ్వీ షా (cricketer Prithvi Shaw) నిరాకరించారు. తాము భోజనం చేయడానికి వచ్చామని, తమను డిస్టర్బ్ చేయవద్దని కోరాడు. అయితే, వారు అక్కడే గొడవ చేయడం స్టార్ట్ చేయడంతో, హోటల్ మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. హోటల్ సిబ్బంది వారిని హోటల్ బయటకు పంపించేశారు.

Prithvi Shaw selfie row: హోటల్ బయట వెయిట్ చేసి..

అయితే, వారు వెళ్లిపోకుండా, హోటల్ వెలుపలనే పృథ్వీ షా, అతని స్నేహితుల కోసం ఎదురుచూడసాగారు. పృథ్వీ షా (Prithvi Shaw), అతని స్నేహితులు కార్లో బయటకు రాగానే బేస్ బాల్ బ్యాట్లతో దాడికి దిగారు. పృథ్వీ షా ఉన్న కారును ధ్వంసం చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోతున్న కార్లను వెంబడించి, పెట్రోల్ బంక్ వద్ద ఆగిన పృథ్వీ షా (Prithvi Shaw) స్నేహితుడి కారు వద్దకు వచ్చి మళ్లీ దాడి చేశారు. తమపై దాడి చేసిన వారిని సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ సప్న గిల్ (sapna gill) లీడ్ చేశారని పృథ్వీ షా (Prithvi Shaw) స్నేహితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెట్రోల్ బంక్ వద్ద నిలిపి ఉన్న తమ కారు వద్దకు వచ్చి రూ. 50 వేలు ఇవ్వకపోతే తప్పుడు కేసు పెడ్తామని సప్న గిల్ (sapna gill) బెదిరించారని వారు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు సప్న గిల్ (sapna gill) తో పాటు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Prithvi Shaw selfie row: పృథ్వీ షా తాగి ఉన్నాడు..

అయితే, పృథ్వీ షా (Prithvi Shaw) చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని సప్న గిల్ తరఫు న్యాయవాది తెలిపారు. సప్న గిల్ బెయిల్ కోసం దరఖాస్తు చేశామన్నారు. ఆ సమయంలో పృథ్వీ షా (Prithvi Shaw) ఆల్కహాల్ తీసుకుని ఉన్నాడని, మద్యం మత్తులో (Prithvi Shaw drunk) బ్యాట్ తో సప్న గిల్ (sapna gill) పై దాడి చేశాడని ఆరోపించారు. మద్యం మత్తులోనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడని ఆరోపించారు. సప్న గిల్ కు బెయిల్ వచ్చిన తరువాత, పృథ్వీ షా, అతడి స్నేహితులపై క్రిమినల్ కేసు పెడ్తామని వెల్లడించారు.