తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Nz Vs Sl: శ్రీలంకకు షాక్.. వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించని మాజీ ఛాంపియన్స్

NZ vs SL: శ్రీలంకకు షాక్.. వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించని మాజీ ఛాంపియన్స్

Hari Prasad S HT Telugu

31 March 2023, 14:11 IST

  • NZ vs SL: శ్రీలంకకు షాక్ తగిలింది. వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయారు మాజీ ఛాంపియన్స్. న్యూజిలాండ్ చేతుల్లో మూడో వన్డేలోనూ ఓటమితో శ్రీలంక ఇప్పుడు అర్హత టోర్నీ ద్వారా మాత్రమే వరల్డ్ కప్ కు వచ్చే అవకాశం ఉంది.

శ్రీలంక టీమ్
శ్రీలంక టీమ్ (AFP)

శ్రీలంక టీమ్

NZ vs SL: మాజీ వరల్డ్ ఛాంపియన్స్ శ్రీలంకకు షాక్ తగిలింది. ఆ టీమ్ 2023 వన్డే వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించలేకపోయింది. న్యూజిలాండ్ తో శుక్రవారం (మార్చి 31) జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 158 పరుగుల టార్గెట్ ను న్యూజిలాండ్ 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. విల్ యంగ్ (86), హెన్రీ నికోల్స్ (44) న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

నిజానికి చేజింగ్ లో న్యూజిలాండ్ 21 పరుగులకే 3, 59 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ ఇద్దరు బ్యాటర్లు మరో వికెట్ పడకుండా టార్గెట్ చేజ్ చేయగలిగారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 100 పరుగులు జోడించి శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఉంటే శ్రీలంక నేరుగా వరల్డ్ కప్ కు అర్హత సాధించేది.

ఇప్పుడు జూన్, జులైలో జరగబోయే 10 జట్ల క్వాలిఫయింగ్ టోర్నీలో శ్రీలంక ఆడాల్సి ఉంటుంది. ఆ టోర్నీ ద్వారా వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఈ కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఓపెనర్ పతున్ నిస్సంక (57), కెప్టెన్ డాసున్ శనక (31) మాత్రమే రాణించారు.

న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, హెన్రీ షిప్లీ, డారిల్ మిచెల్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు ఇండియాతోపాటు మరో ఆరు జట్లు అర్హత సాధించాయి. సూపర్ లీగ్ స్టాండింగ్స్ తో వెస్టిండీస్ కూడా ఆటోమేటిగ్గా క్వాలిఫై అవుతుంది.

1996 ఛాంపియన్స్ అయిన శ్రీలంకకు రెండో వన్డే రద్దవడంతో ద్వారా ఐదు పాయింట్లే వచ్చాయి. ఆ మ్యాచ్ లో గెలిచి ఉంటే పది పాయింట్లు దక్కేవి. ఇక తొలి వన్డేలో దారుణంగా ఓడటంతోపాటు స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక పాయింట్ కోల్పోయింది. ఇంతకుముందు న్యూజిలాండ్ చేతుల్లో టెస్టు సిరీస్ లోనూ శ్రీలంక 0-2తో ఓడిపోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది.