తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Nikhat Zareen: నిఖత్ పంచ్ అదిరింది.. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్స్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

Nikhat Zareen: నిఖత్ పంచ్ అదిరింది.. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్స్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

Hari Prasad S HT Telugu

21 March 2023, 19:48 IST

  • Nikhat Zareen: నిఖత్ పంచ్ అదిరింది.. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్స్ చేరింది డిఫెండింగ్ ఛాంపియన్. ఈ తెలంగాణ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ఛాంపియన్ గా నిలవడానికి సిద్ధమవుతోంది.

ప్రత్యర్థిపై పంచ్ విసురుతున్న నిఖత్ జరీన్
ప్రత్యర్థిపై పంచ్ విసురుతున్న నిఖత్ జరీన్ (PTI)

ప్రత్యర్థిపై పంచ్ విసురుతున్న నిఖత్ జరీన్

Nikhat Zareen: వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో దూసుకెళ్తోంది ఇందూరు అమ్మాయి నిఖత్ జరీన్. 50 కేజీల విభాగంలో మంగళవారం (మార్చి 21) జరిగిన బౌట్ లో ఆమె ప్రత్యర్థిని నాకౌట్ చేసింది. ఆమె పంచ్ లతో చెలరేగడంతో రిఫరీ మధ్యలోనే బౌట్ ఆపేశారు. నిఖత్ తోపాటు 48 కేజీల విభాగంలో నీతూ గంగాస్, 57 కేజీల విభాగంలో మనీషా మౌన్ కూడా క్వార్టర్స్ చేరారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

డిఫెండింగ్ ఛాంపియన్ అయిన నిఖత్ రౌండ్ ఆఫ్ 16 బౌట్ లో మెక్సికోకు చెందిన పాట్రికా అల్వారెజ్ హెరెరాను 5-0తో ఓడించింది. అటు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన నీతూ.. తజకిస్థాన్ కు చెందిన సుమయ్యా ఖోసిమోవాపై రౌండ్ ఆఫ్ 16లో విజయం సాధించింది. మరోవైపు తుర్కియే బాక్సర్ నూర్ తుర్హాన్ పై మనీషా గెలిచింది.

అటు మరో ఇండియన్ బాక్సర్ శశి చోప్రా 63 కేజీల విభాగంలో జపాన్ కు చెందిన మై కిటో చేతుల్లో ఓడిపోయింది. రౌండ్ ఆఫ్ 16 బౌట్ లో నిఖత్ చెలరేగిపోయింది. ఆమె పంచ్ లతో విరుచుకుపడటంతో రిఫరీ మధ్యలోనే బౌట్ ను ఆపేసి నిఖత్ ను విజేతగా ప్రకటించారు. అటు నీతూ కూడా తాను ఎదుర్కొన్న రెండు బౌట్లలోనూ ఇలాగే గెలిచింది.

నిఖత్ జరీన్ గతేడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆమె గతేడాది కామన్వెల్త్ గేమ్స్ లోనూ పసిడి పంచ్ తో అదరగొట్టింది. ఇప్పుడు మరోసారి క్వార్టర్ ఫైనల్ చేరి మెడల్ పై ఆశలు రేపుతోంది.

టాపిక్