తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Nikhat Zareen Gold Medal: నేష‌న‌ల్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో నిఖ‌త్ జ‌రీన్‌కు గోల్డ్ మెడ‌ల్‌

Nikhat Zareen Gold Medal: నేష‌న‌ల్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో నిఖ‌త్ జ‌రీన్‌కు గోల్డ్ మెడ‌ల్‌

27 December 2022, 9:17 IST

  • Nikhat Zareen Gold Medal: ఉమెన్స్ నేష‌న‌ల్ బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి నిఖ‌త్ జ‌రీన్ స‌త్తాచాటింది. యాభై కేజీల విభాగంలో గోల్డ్ మెడ‌ల్ సొంతం చేసుకున్న‌ది.

నిఖ‌త్ జ‌రీన్
నిఖ‌త్ జ‌రీన్

నిఖ‌త్ జ‌రీన్

Nikhat Zareen Gold Medal: ఉమెన్స్ నేష‌న‌ల్ బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో తెలంగాణ ప్లేయ‌ర్ నిఖ‌త్ జ‌రీన్ గోల్డ్ మెడ‌ల్ సొంతం చేసుకున్న‌ది. యాభై కేజీల విభాగంలో సోమ‌వారం జ‌రిగిన ఫైన‌ల్‌లో 4-1 తేడాతో రైల్వేస్ ప్లేయ‌ర్‌ అనామిక‌పై విజ‌యాన్ని సాధించిన నిఖ‌త్‌ స్వ‌ర్ణ ప‌తాకం ద‌క్కించుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

తొలుత అనామిక నుంచి నిఖ‌త్‌కు గ‌ట్టిపోటీ ఎదురైంది. కానీ చివ‌రి బౌట్‌లో ఒత్తిడిని జ‌యిస్తూ ప్ర‌త్య‌ర్థిని చిత్తుచేసిన నిఖ‌త్ గోల్డ్ మెడ‌ల్ కైవ‌సం చేసుకున్న‌ది. ఇటీవ‌ల జ‌రిగిన కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో నిఖ‌త్ జ‌రీన్ గోల్డ్ మెడ‌ల్ ద‌క్కించుకున్న‌ది. ఈ ఏడాది వ‌ర‌ల్డ్ బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్ 52 కేజీల విభాగంలో నిఖ‌త్ గోల్డ్ మెడ‌ల్ సాధించిన సంగ‌తి తెలిసిందే.

నేష‌న‌ల్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్ విజ‌యాన్ని పుర‌స్క‌రించుకొని ఈ ఏడాది మూడు గోల్డ్ మెడ‌ల్స్ సాధించ‌డం ఆనందంగా ఉంద‌ని నిఖ‌త్ జ‌రీన్ ట్వీట్ చేసింది.

ఈ బాక్సింగ్ పోటీల్లో ఒలింపిక్ బ్రాంజ్ మెడ‌లిస్ట్ ల‌వ్లీనా 75 కేజీల విభాగంలో గోల్డ్ మెడ‌ల్ సొంతం చేసుకున్న‌ది. 5-0 తేడాతో అరుంధ‌తి చౌద‌రిపై ల‌వ్లీనా విజ‌యాన్ని సాధించింది.

టాపిక్

తదుపరి వ్యాసం