తెలుగు న్యూస్  /  Sports  /  Nicholas Pooran Becomes 2nd Player In Ipl To Hit Three Sixes Off First Three Balls

Pooran IPL Record: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా రికార్డు

13 May 2023, 22:07 IST

    • Pooran IPL Record: లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న మూడు బంతులను సిక్సర్లుగా మరల్చిన అతడు.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.
నికోలస్ పూరన్
నికోలస్ పూరన్ (AFP)

నికోలస్ పూరన్

Pooran IPL Record: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు హైదరాబాద్ వైపున్న ఈ మ్యాచ్ ఫలితాన్ని లక్నో వైపునకు తిప్పిన ఘనత ఆ జట్టు బ్యాటర్ నికోలస్ పూరన్‌కే దక్కుతుంది. ఫలితంగా లక్నో మరో 4 బంతులు మిగిలుండగానే 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సర్వాత్ర నికోలస్ పూరన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతేడాది వరకు హైదరాబాద్ తరఫున ఆడిన పూరన్.. అప్పుడు చెప్పుకోదగ్గ ప్రదర్శనైతే చేయలేదు. కానీ ఈ సారి లక్నో తరఫున ఆడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ మ్యాచ్‌లో వచ్చి రావడంతోనే సిక్సర్ల వర్షం కురిపించిన నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు. సన్‌రైజర్స్ బౌలర్ అభిషేక్ శర్మ వేసిన 16వ ఓవర్లో తను ఎదుర్కొన్న మూడు బంతులను సిక్సర్లుగా మరల్చాడు పూరన్. ఐపీఎల్ చరిత్రలోనే ఫస్ట్ మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా పూరన్ రికార్డు సృష్టించాడు. కేకేఆర్ ఆటగాడు సునీల్ నరైన్ ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నాడు. 2021 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ డ్యాన్ క్రిస్టయన్ బౌలింగ్‌లో వరుసగా తను ఎదుర్కొన్న మొదటి మూడు బంతులను స్టాండ్స్‌లోకి తరలించాడు.

ఈ విజయంతో లక్నో జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. ప్లేఆఫ్స్ ఆశలు నిలవలాంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు.. ప్రేరక్ మన్కడ్(64), నికోలస్ పూరన్(44), స్టోయినీస్(40) రాణించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి మ్యాచ్‌ను తన కంట్రోల్‌లో ఉంచుకున్న సన్‌రైజర్స్ చివరి ఐదు ఓవర్లలో మాత్రం చేతులెత్తేయడంతో లక్నో గెలిచింది. హైదరాబాద్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మయాంక్ మార్కండే తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

మరోపక్క ఈ పరాజయంతో సన్‌రైజర్స్ తన ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లుకుంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే హైదరాబాద్ గెలిచింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించినా ఆరెంజ్ ఆర్సీ ప్లేఆఫ్స్‍‌కు చేరడం దాదాపు అసాధ్యమే. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం చేసుకోవడమే కాకుండా.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.