తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Nz 2nd Odi: టాస్ గెలిచిన కివీస్.. ఇండియా బ్యాటింగ్

IND vs NZ 2nd ODI: టాస్ గెలిచిన కివీస్.. ఇండియా బ్యాటింగ్

27 November 2022, 7:05 IST

    • IND vs NZ 2nd ODI: ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య నేడు రెండో వ‌న్డే జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న‌ది. మరోవైపు ఈ మ్యాచ్  భారత్ కు చావోరేవోగా మారింది.
టాస్ గెలిచిన కివీస్.. ఇండియా బ్యాటింగ్
టాస్ గెలిచిన కివీస్.. ఇండియా బ్యాటింగ్ (ANI)

టాస్ గెలిచిన కివీస్.. ఇండియా బ్యాటింగ్

New zealand vs India ODI Series 2022: ఆదివారం హోమిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌ - భారత్ మధ్య రెండో వన్డే జరగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన కివీస్.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. మూడో వన్టేల టోర్నీలో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్‌ను చేజార్చుకుంది. 306 పరుగులు చేసిన తర్వాత కూడా ఆక్లాండ్‌లో ఓటమి ఎదురైంది. ఇక నేటి మ్యాచ్ లో మరోసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్... బౌలింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో గెలిచి సిరీస్ ను గెలవాలని న్యూజిలాండ్ భావిస్తుండగా… గెలిచి సిరీస్ లో నిలవాలని టీంఇండియా చూస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

రెండో వన్టే మ్యాచ్ లో కొన్ని మార్పులతో బరిలోకి దిగింది భారత్. శార్ధూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్, సంజు శాంసన్ స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నారు. ధావన్ తో కలిసి గిల్ ఓపెనింగ్ కు దిగాడు. ఇక ఈ మ్యాచ్ కు కుల్దీప్ యాదవ్ ను తీసుకుంటారని భావించినప్పటికీ అలా జరగలేదు.

భారత్ జట్టు

దావన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిపబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపాక్ హుడా. సుందర్, దీపాక్ చహర్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, చాహల్

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, కాన్వే, విలియమ్సన్, మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, ఫెర్గూసన్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవడంతో కివీస్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. దీంతో ఈ రెండో వన్డే భారత్‌కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే మూడో వన్డే ఉత్కంఠభరితంగా ఉంటుంది.

టాపిక్