తెలుగు న్యూస్  /  Sports  /  Netherlands Strikes Late To Beat Senegal 2-0 In Group A Fifa 2022

Netherlands vs Senegal FIFA 2022: చివర్లో పుంజుకున్న నెదర్లాండ్స్.. సెనెగల్‌పై అద్భుత విజయం

22 November 2022, 8:12 IST

    • Netherlands vs Senegal FIFA 2022: సెనెగల్‌తో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ గెలిచింది. చివర్లో పుంజుకున్న ఈ జట్టు 2-0 తేడాతో సెనెగల్‌పై విజయాన్ని సొంతం చేసుకుంది.
సెనెగల్‌పై నెదర్లాండ్స్ విజయం
సెనెగల్‌పై నెదర్లాండ్స్ విజయం (REUTERS)

సెనెగల్‌పై నెదర్లాండ్స్ విజయం

Netherlands vs Senegal FIFA 2022: ఫిఫా ప్రపంచకప్‌లో మరో అదిరిపోయే మ్యాచ్‌ సోమవారం జరిగింది. సెనెగల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ విజయాన్ని సాధించింది. ఆ జట్టులో కోడీ గాక్‌పో డ్యావీ క్లాసెన్ విజృంభించడంతో 2-0 గోల్స్ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ఫిఫా 2022 వరల్డ్ కప్‌ను శుభారంభంతో మొదలుపెట్టింది. మ్యాచ్ ఆద్యంతం నెదర్లాండ్స్ ఆధిపత్యం కనిపించింది. ఆట ప్రారంభంలోనే నెదర్లాండ్స్‌కు గోల్ చేసే అవకాశమొచ్చింది. మొదటి నాలుగు నిమిషాల్లోనే డచ్ ఆటగాడు కోడీ గాక్పో ప్రత్యర్థి గోల్ పోస్ట్ వైపు కొట్టాలని చూశాడు. అయితే అది మిస్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అనంతరం 10వ నిమిషంలో సెనెగల్ ప్లేయర్ ఇస్మాలియా స్టార్ గోల్ కొట్టే అవకాశం రాగా. అతడి అదృష్టం కలిసి రాలేదు. తృటిలో గోల్ పోస్టును తప్పించుకుని పక్కకు వెళ్లింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే నెదర్లాండ్స్ మిడ్ ఫీల్డర్ ఫ్రాంకీ డీ జాంగ్‌కు గోల్ కొట్టే అవకాశమొచ్చంది. బెర్జివిన్ ఇచ్చిన పాస్‌ను అతడు వినియోగించుకోలేకపోయాడు. ఇరు జట్లు హోరా హోరీగా ఆడగా.. మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి 0-0తో రాణించారు.

సెకండాఫ్‌లో సెనెగల్ ఎటాకింగ్‌కు దిగగా డచ్ ఢిపెన్స్‌పై ఒత్తిడి పడింది. అయితే వేగంగా కౌంటర్ ఎటాక్స్ ఇవ్వడంతో గోల్ నమోదు కాలేదు. సెనెగల్ ప్లేయర్ క్రెపెన్ డయాటా కొట్టిన షాట్‌ను గోల్ కీపర్ ఆండ్రీస్ కళ్లు చెదిరే రీతిలో ఆపాడు. గేమ్ చివరికి వచ్చేసరికి ఉత్కంఠ భరితంగా మారింది. ఇలాంటి సమయంలో సెనెగల్ మిడ్ ఫీల్డర్ కొయాటే గాయంతో వెనుదిరగడం ఆ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఈ మ్యాచ్ డ్రా దిశగా వెళ్తున్న సమయంలో 84వ నిమిషంలో డచ్ ఆటగాడు గాక్పో గోల్ కొట్టి బ్రేక్ ఇచ్చాడు. ప్రత్యర్థి గోల్ కీపర్ ఎడ్వార్డ్ మెండీ పేలవ ప్రదర్శన నెదర్లాండ్స్‌కు కలిసొచ్చింది.

దీంతో నెదర్లాండ్స్ జట్టుకు విజయం దిశగా అడుగులు వేసింది. అంతటితో ఆగకుండా చివరి నిమిషంలో ఆ జట్టు ప్లేయర్ డావీ క్లాసెన్ అద్భుతమైన గోల్‌తో గెలుపు ఖరారైంది. 2-0 తేడాతో సెనెగల్‌పై విజయాన్ని సొంతం చేసుకుంది. నెదర్లాండ్స్ తన రెండో మ్యాచ్‌ను నవంబరు 25న ఈక్వెడార్‌తో ఆడనుంది.

సోమవారం నాడు అమెరికా, వేల్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన యూఎస్ఏకు వేల్స్ ప్లేయర్ గారేత్ బేల్ షాకిచ్చాడు. అందివచ్చిన పెనాల్టీ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని గోల్ కొట్టడంతో 1-1తేడాతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో శుభారంభం చేయాలనుకున్న యూఎస్ఏకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 36వ నిమిషంలో అమెరికన్ ప్లేయర్ టిమోతీ గోల్ కొట్టడంతో ఆ జట్టు ఆధిపత్యం చెలాయించింది. కానీ చివర్లో గారెత్ బేల్ షాక్ ఇచ్చాడు.