తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup 2022 Day 3 Schedule: మంగళవారం నాడు జరగబోయే మ్యాచ్‌లు ఇవే.. బరిలోకి టైటిల్ ఫేవరెట్లు

FIFA world cup 2022 Day 3 schedule: మంగళవారం నాడు జరగబోయే మ్యాచ్‌లు ఇవే.. బరిలోకి టైటిల్ ఫేవరెట్లు

22 November 2022, 7:40 IST

    • FIFA world cup 2022 Day schedule: మంగళవారం నాడు ఫిఫా వరల్డ్ కప్‌ టోర్నీలో అదిరిపోయే మ్యాచ్‌లు జరగనున్నాయి. అర్జెంటీనా లాంటి పెద్ద జట్టుతో పాటు ఢిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ కూడా పోటీ పడనుంది.
సౌదీ అరేబియాతో మ్యాచ్ కు ముందు అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ
సౌదీ అరేబియాతో మ్యాచ్ కు ముందు అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ

సౌదీ అరేబియాతో మ్యాచ్ కు ముందు అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ

FIFA world cup 2022 Day schedule: ఖతర్ వేదికగా ఫుట్‌బాల్ ప్రపంచకప్ సమరం ఆదివారం నాడు ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం నాడు ఇరాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. సెనెగల్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ గెలవగా.. యూఎస్ఏ-వేల్స్ మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో మూడో రోజైన మంగళవారం నాడు మరో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రోజు కొన్ని ఆసక్తికర మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న లియోనల్ మెస్సీ జట్టు అర్జెంటీనా ఈ రోజే తన తొలి మ్యాచ్ ఆడనుంది. అంతేకాకుండా డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు కూడా ఈ రోజే బరిలో దిగనుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ రోజు మ్యాచ్‌ల వివరాలు..

- మొదటి మ్యాచ్ గ్రూప్-సీ జట్లయిన అర్జెంటీనా-సౌదీ అరేబియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.

- రెండో మ్యాచ్ గ్రూప్ డీ నుంచి డెన్మార్క్-టునేషియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటలకు జరగనుంది.

- మూడో మ్యాచ్ గ్రూప్-సీ జట్లయిన మెక్సికో-పోలాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.

- ఈ రోజు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఫ్రాన్స్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరనుంది.

ఈ రోజు రెండు పెద్ద జట్లు బరిలో దిగనున్నాయి. మెస్సీ ఆడుతున్న అర్జెంటీనా జట్టు సౌదీ అరేబియాతో పోటీ పడుతుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇవి కాకుండా డెన్మార్క్‌ను, పోలాండ్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు.

భారత అభిమానులు ఫిఫా 2022 మ్యాచ్‌లు చూసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఫిఫా అధికారిక ఛానల్‌ నుంచి చూడావచ్చు. లేదంటే స్పోర్ట్స్ 18 ఛానల్‌లో వీక్షించవచ్చు. ఒకవేళ హై క్వాలిటీలో చూడాలంటే న్యూస్-18హెచ్‌డీ ఛాన్‌లో వీక్షించవచ్చు. మొబైల్‌లో చూడాలనుకునేవారు జియో యాప్‌లో వీక్షించవచ్చు.

తదుపరి వ్యాసం