తెలుగు న్యూస్  /  Sports  /  Major League Cricket To Be Held In America In July As Some Of The Top Player Signed For It

Major League Cricket: క్రికెట్‌లో మరో లీగ్.. ఈసారి అమెరికాలో.. ఒప్పందం చేసుకున్న టాప్ ప్లేయర్స్

Hari Prasad S HT Telugu

20 March 2023, 18:40 IST

  • Major League Cricket: క్రికెట్‌లో మరో లీగ్ వస్తోంది. ఈసారి అమెరికాలో లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టాప్ ప్లేయర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ లీగ్ ఏంటి? ఆ ప్లేయర్స్ ఎవరు? ఒకసారి చూద్దాం.

అమెరికాలో జరగనున్న మేజర్ లీగ్ క్రికెట్
అమెరికాలో జరగనున్న మేజర్ లీగ్ క్రికెట్

అమెరికాలో జరగనున్న మేజర్ లీగ్ క్రికెట్

Major League Cricket: క్రికెట్ లో లీగ్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. తాజాగా అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket) జరగనుంది. ఈ లీగ్ అమెరికాలోని డల్లాస్ లో జులై 13 నుంచి 30 వరకూ జరగనుంది. ప్రపంచ క్రికెట్ లోని కొందరు టాప్ ప్లేయర్స్ ఈ లీగ్ తో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ మేజర్ లీగ్ క్రికెట్ లో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. అవి ఎంఐ న్యూయార్క్, డీసీ వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సియాటెల్ ఆర్కాస్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ ఫ్రాంఛైజీ (చెన్నై సూపర్ కింగ్స్ యజమనులది). ఈ లీగ్ లో ఆడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, ఎన్రిచ్ నోక్యా, శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగలాంటి ప్లేయర్స్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఆరోన్ ఫించ్ తమ టీమ్ ను లీడ్ చేయనున్నాడని శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ సోమవారం (మార్చి 20) వెల్లడించింది. ఇక డికాక్.. సియాటెల్ ఆర్కాస్ కు ఆడనున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో టీమ్ లో ఫించ్ తోపాటు మార్కస్ స్టాయినిస్, కోరీ ఆండర్సన్, లియామ్ ప్లంకెట్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇక మాజీ ఇండియన్ అండర్ 19 టీమ్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ లాస్ ఏంజిల్స్ టీమ్ కు ఆడనున్నాడు. అతడు ఈ మధ్యే బీసీసీఐతో తెగదెంపులు చేసుకొని అమెరికా వెళ్లాడు.

లాస్ ఏంజిల్స్ టీమ్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ యజమానులే కొనుగోలు చేయడం విశేషం. ఆదివారం (మార్చి 19) ఈ మేజర్ లీగ్ క్రికెట్ ప్లేయర్స్ డ్రాఫ్ట్ నిర్వహించారు. ఇందులో ప్రతి టీమ్ 9 మంది అమెరికా ప్లేయర్స్ తో పాటు కొందరు విదేశీ ప్లేయర్స్ తోనూ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక న్యూయార్క్ టీమ్ ఓనర్ గా ముంబై ఇండియన్స్ ఉంది. ఈ టీమ్ ఇంకా చెప్పుకోదగిన విదేశీ ప్లేయర్స్ తో ఒప్పందం చేసుకోలేదు.

టాపిక్