తెలుగు న్యూస్  /  Sports  /  Kumble On Team India Says It Needs Separate Teams For White And Red Ball Cricket

Kumble on Team India: టెస్టులు, వన్డే, టీ20లకు వేర్వేరు టీమ్స్‌ ఉండాల్సిందే: అనిల్‌ కుంబ్లే

Hari Prasad S HT Telugu

14 November 2022, 17:16 IST

    • Kumble on Team India: టెస్టులు, వన్డే, టీ20లకు వేర్వేరు టీమ్స్‌ ఉండాల్సిందేనని అన్నాడు మాజీ కెప్టెన్‌, మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే. టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌లోనే టీమిండియా ఇంటిదారి పట్టిన తర్వాత కుంబ్లే కీలకమైన సూచనలు చేశాడు.
అనిల్ కుంబ్లే
అనిల్ కుంబ్లే (Getty)

అనిల్ కుంబ్లే

Kumble on Team India: టీ20 వరల్డ్‌కప్‌ 2022 కూడా ఇండియన్‌ టీమ్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. సూపర్‌ 12 స్టేజ్‌లో అదరగొట్టినా సెమీస్‌లో ఓడిన తీరు టీమ్‌ను, అభిమానులను చాలాకాలం పాటు వెంటాడనుంది. ఇంగ్లండ్‌ చేతుల్లో ఏకంగా 10 వికెట్లతో ఓడటం మింగుడు పడనిదే. ఈ ఓటమి తర్వాత ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఎన్నో సలహాలు, సూచనలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇప్పుడు మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే కూడా కీలకమైన సూచన చేశాడు. వైట్‌, రెడ్‌బాల్‌ క్రికెట్‌కు వేర్వేరు టీమ్స్‌ ఉండాల్సిందేనని అతడు స్పష్టం చేశాడు. ఈఎస్పీఎన్‌ క్రికిన్ఫోతో మాట్లాడుతూ.. టీ20 స్పెషలిస్టులు ఉండాలన్నాడు.

"కచ్చితంగా, వేర్వేరు టీమ్స్ ఉండాలి. కచ్చితంగా టీ20 స్పెషలిస్టులు ఉండాలి. ఇప్పటి ఇంగ్లండ్‌ టీమ్‌ అయినా, గతేడాది ఆస్ట్రేలియా టీమ్‌ అయినా ఆల్‌రౌండర్లపై ఎక్కువగా దృష్టిసారించాలని చాటి చెప్పాయి. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను చూడండి. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.

ఈ ఇతర టీమ్‌లోనూ ఏడో స్థానంలో లివింగ్‌స్టోన్‌లాంటి నాణ్యమైన బ్యాటర్‌ లేడు. ఆస్ట్రేలియాకు స్టాయినిస్‌ ఆరోస్థానంలో వస్తాడు. అలాంటి టీమ్‌ను నిర్మించాలి. దానిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఒక్కో టీమ్‌కు ఒక్కో కెప్టెన్‌ లేదా కోచ్‌ ఉండాలన్నదానిపై నేనేమీ చెప్పలేను. అదంతా ఎలాంటి టీమ్‌ను నిర్మిస్తున్నారు, దాని చుట్టూ ఎలాంటి సపోర్ట్‌, లీడర్‌షిప్‌ టీమ్‌ ఉండాలన్నదానిపై ఆధారపడి ఉంటుంది" అని కుంబ్లే అన్నాడు.

ఇండియాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 169 రన్స్‌ టార్గెట్‌ను 16 ఓవర్లలోనే వికెట్‌ కూడా కోల్పోకుండా చేజ్‌ చేసింది. ఆ తర్వాత ఫైనల్లో వాళ్ల బ్యాటింగ్ కాస్త తడబడినా.. ఈసారి బెన్‌ స్టోక్స్‌ హాఫ్‌ సెంచరీతో ఇంగ్లండ్‌కు అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టాడు. ఇంగ్లండ్‌ టీమ్‌లోనూ మొయిన్‌ అలీ, బెన్‌ స్టోక్స్‌, లివింగ్‌స్టోన్‌లాంటి క్వాలిటీ ఆల్‌రౌండర్లు ఉన్నారు.