PAK vs ENG T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్ - ఫైనల్‌లో పాక్ చిత్తు
PAK vs ENG T20 World Cup Final: టీ20 వరల్డ్ విజేతగా ఇంగ్లాండ్ నిలిచింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ విజేతగా నిలవడం ఇది రెండోసారి.
PAK vs ENG T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్ ఆవిర్భవించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. స్వల్ప టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్‌ను హాఫ్ సెంచరీతో బెన్ స్టోక్స్ ఆదుకున్నాడు. 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లాండ్ ను గెలిపించాడు.
137 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్‌కు మొదటి ఓవర్‌లోనే అలెక్స్ హేల్స్‌ను ఔట్ చేసి షాహిన్ అఫ్రిది షాక్ ఇచ్చాడు. ఫిలిప్ సాల్ట్ కూడా 10 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ బట్లర్ (26 రన్స్) కూడా ఐదో ఓవర్‌లో ఔట్ కావడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. బెన్ స్టోక్స్, బ్రూక్స్ కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ ఇంగ్లాండ్‌ను విజయం వైపు నడిపించారు. 84 రన్స్ వద్ద బ్రూక్ వికెట్ కోల్పోయింది.
ఓ వైపు వికెట్లు పడుతోన్న బెన్ స్టోక్స్ మాత్రం పట్టుదలగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా ఇంగ్లాండ్‌ను గెలిపించాడు. 49 బాల్స్‌లో ఒక సిక్సర్, ఐదు ఫోర్లతో 52 పరుగులు చేసిన స్టోక్స్ నాటౌట్‌గా నిలిచాడు.
పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, షాహిన్ అఫ్రిది, మహ్మద్ వాసిమ్, షాబాద్ ఖాన్ తలో ఒక్క వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది.
పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్స్‌లో షాన్ మసూద్ 38, బాబర్ ఆజాం 32, షాబాద్ ఖాన్ 20 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
టీ20 వరల్డ్ కప్‌ను ఇంగ్లాండ్ గెలవడం ఇది రెండోసారి. 2010లో తొలిసారి టీ20 వరల్డ్‌కప్ గెలుచుకుంది ఇంగ్లాండ్. మళ్లీ పన్నెండేళ్ల తర్వాత రెండోసారి విజేతగా నిలిచింది.