తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul Marriage : కేఎల్ రాహుల్ పెళ్లికి ఫోన్ అనుమతి లేదంట!

KL Rahul Marriage : కేఎల్ రాహుల్ పెళ్లికి ఫోన్ అనుమతి లేదంట!

Anand Sai HT Telugu

21 January 2023, 11:59 IST

    • KL Rahul Athiya Shetty Wedding : టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి పీటలెక్కుతున్నాడు. పెళ్లి కారణంగానే.. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరంగా ఉన్నాడు. జనవరి 23న బాలీవుడ్ నటి అథియా శెట్టిని వివాహం చేసుకోనున్నాడు. అయితే పెళ్లి వేడుకకు వచ్చేవరికి కొన్ని రూల్స్ పెట్టారంట..!
అథియాతో కేఎల్ రాహుల్
అథియాతో కేఎల్ రాహుల్ (twitter)

అథియాతో కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్, అథియా శెట్టి వివాహం(KL Rahul Athiya Shetty Wedding) దగ్గరపడుతుంది. వీరిద్దరూ ఒకటి కానున్నారు. బాలీవుడ్ (Bollywood)సీనియర్ నటుడు సునీల్ శెట్టికి చెందిన విలాసవంతమైన ఖండలా బంగ్లాలో కేఎల్ రాహుల్, అథియా శెట్టిల పెళ్లి జరగనుంది. పెళ్లి వేడుకకు సంబంధించి.. ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే వివాహానికి హాజరవుతున్నప్పుడు అతిథులు అనుసరించాల్సిన కొన్ని విధానాలూ ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

జనవరి 22న జరిగే మెహందీతో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయి. సాయంత్రం సంగీత్ ఉంటుంది. ఈ వేడుక శెట్టి ముంబయి హౌస్‌లో జరుగుతుంది. మరుసటి రోజు ఖండాలాలోని విలాసవంతమైన బంగ్లాలో వివాహం జరగనుందని తెలుస్తోంది. రెండు వైపుల నుండి 100 మంది అతిథులు వివాహానికి హాజరవుతారని, ఎటువంటి ఫోటోలు లేదా వీడియోలను తీసు సోషల్ మీడియాలో పంచుకోవద్దని వచ్చే వారికి సూచనలు వెళ్లాయని తెలుస్తోంది.

పెళ్లి సమయంలో వారి మొబైల్ ఫోన్లు(Mobile Phone) కూడా దూరంగా ఉంచుతారు. ఖండాలాలో వివాహం జరిగిన కొన్ని వారాల తర్వాత, ఈ జంట ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. కేఎల్ రాహుల్(KL Rahul), అథియా శెట్టి పెళ్లి వేడుకకు షారుక్, అమీర్, హృతిక్ రోషన్, అమితాబ్, అక్షయ్‌తో పాటు క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కుటుంబసమేతంగా హాజరయ్యే అవకాశం ఉంది.

ప్రముఖ మీడియా ఫోటోగ్రాఫర్ వరీందర్ చావ్లా.. KL రాహుల్ అపార్ట్‌మెంట్ భవనం వెలుపలి భాగాన్ని వీడియో తీశారు. ఈ వీడియోలో భవనాన్ని రంగురంగుల లైట్లతో అలకరించారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇది కేఎల్ రాహుల్ పెళ్లికి సంబంధించినది కాదు. ఈ భవనం వేరేవారి వివాహానికి సంబంధించినది కావచ్చని తెలుస్తోంది.

వరీందర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశారు. 'సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అతియా శెట్టితో తన వివాహానికి ముందు భారత క్రికెటర్ KL రాహుల్ భవనం వెలుపల విజువల్స్.' అంటూ షేర్ చేశారు. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ కుటుంబాలు మాత్రం పెళ్లి గురించి మౌనంగానే ఉన్నాయి. జనవరి 23న వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి.