తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul-athiya Shetty Wedding: కేఎల్ రాహుల్-అతియా శెట్టి పెళ్లి డేట్ ఫిక్స్.. ధోనీ సహా క్రికెట్ ప్రముఖులకు ఆహ్వానం

KL Rahul-Athiya Shetty Wedding: కేఎల్ రాహుల్-అతియా శెట్టి పెళ్లి డేట్ ఫిక్స్.. ధోనీ సహా క్రికెట్ ప్రముఖులకు ఆహ్వానం

13 January 2023, 7:21 IST

    • KL Rahul-Athiya Shetty Wedding: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తే అతియా శెట్టితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీర్దదరి పెళ్లికి ముహూర్తం ఫిక్సయినట్లు తెలుస్తోంది.
కేఎల్ రాహుల్-అతియా శెట్టి
కేఎల్ రాహుల్-అతియా శెట్టి (ANI)

కేఎల్ రాహుల్-అతియా శెట్టి

KL Rahul-Athiya Shetty Wedding: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తే అతియా శెట్టి.. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ చాలా సార్లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరా కంటికి చిక్కారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ తమ ఫొటోలను షేర్ చేస్తూ తమ సంబంధం గురించి చెప్పకనే చెప్పారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా బాగా వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు వీరి వివాహానికి ముహూర్తం ఫిక్సయినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

కేఎల్ రాహుల్-అతియా శెట్టి పెళ్లి ఈ నెల 23న జరగబోతుందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. మహారాష్ట్ర ఖండాలలోని సునీల్ శెట్టి నివాసంలో ఇరుకుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, అతిథుల మధ్య వీరి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

ఈ నెల 21 నుంచి పెళ్లి వేడుకలు ప్రారంభమవుతాయని సమాచారం. వీరి వివాహానికి బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు మరికొంతమంది క్రికెట్, సినీ ప్రముఖులు హాజయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో గురువారం జరిగిన రెండో వన్డేలో భారత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపులో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. రాహుల్ అర్ధశతకంతో రాణించాడు. టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన వేళ.. కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజులో నిలిచి నిలకడగా ఆడాడు. అంతేకాకుండా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టాపిక్

తదుపరి వ్యాసం