తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Breaks Jayawardene Record: కోహ్లీ తన రికార్డు బ్రేక్ చేయడంపై జయవర్దనే సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

Kohli Breaks Jayawardene Record: కోహ్లీ తన రికార్డు బ్రేక్ చేయడంపై జయవర్దనే సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

03 November 2022, 17:53 IST

  • Kohli Breaks Jayawardene Record: టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇంతకుముందు జయవర్దనే పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

కోహ్లీ తన రికార్డు బ్రేక్ చేయడంపై జయవర్దనే స్పందన
కోహ్లీ తన రికార్డు బ్రేక్ చేయడంపై జయవర్దనే స్పందన (AP/ PTI)

కోహ్లీ తన రికార్డు బ్రేక్ చేయడంపై జయవర్దనే స్పందన

Kohli Breaks Jayawardene Record: టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటి వరకు శ్రీలంక మాజీ ప్లేయర్ మహేల జయవర్ధనే పేరు మీద ఉండేది. అయితే గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి జయవర్దనే రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 44 బంతుల్లో 64 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జయవర్దనే 31 ఇన్నింగ్స్‌ల్లో 1016 పరుగులు చేస్తే.. విరాట్ కేవలం 23 ఇన్నింగ్సుల్లోనే 1065 పరుగులతో శ్రీలంక మాజీ క్రికెటర్ రికార్డును అధిగమించాడు. కోహ్లీ తన రికార్డును బ్రేక్ చేయడంపై శ్రీలంక మాజీ మహేల జయవర్ధనే కూడా స్పందించాడు. రికార్డులు ఉన్నది బ్రేక్ చేయడానికేనని, అది కోహ్లీ అయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

జయవర్ధనే ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని కోహ్లీతో పంచుకున్నాడు. "రికార్డులు ఉన్నది బద్దలు కొట్టడానికే. ఎవరైనా నా రికార్డు బ్రేక్ చేస్తారా అంటే అది నువ్వే. విరాట్ నువ్వు చాలా తెలివైన ఆటగాడివి. నీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఫామ్ తాత్కాలికమే.. క్లాస్ శాశ్వతం. బాగా ఆడుతున్నావ్ మిత్రమా." అంటూ విరాట్ కోహ్లీకి జయవర్దనే అభిననందలు తెలియజేశాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 64 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనతో జయవర్దనే రికార్డు బ్రేక్ చేశాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో జయవర్దనే 1016 పరుగులు చేశాడు. 2007 నుంచి 2014 టీ20 వరల్డ్ కప్ వరకు ఆడాడు. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ 2012 నుంచి ఇప్పటి వరకు 80కిపైగా సగటుతో కేవలం 23 ఇన్నింగ్సుల్లోనే 1065 పరుగులతో జయవర్దనే రికార్డు బ్రేక్ చేశాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం 16 ఓవర్లలో బంగ్లా 151 పరుగులను ఛేదించాల్సి ఉండగా.. 145 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో దూకుడుగా ఆడిన బంగ్లా జట్టు.. అనంతరం పదే పదే వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ తన అద్భుత అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.