తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wpl First Hat Trick: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ న‌మోదు - ఈ ఘ‌న‌త సాధించిన బౌల‌ర్ ఎవ‌రంటే

Wpl First Hat trick: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ న‌మోదు - ఈ ఘ‌న‌త సాధించిన బౌల‌ర్ ఎవ‌రంటే

25 March 2023, 12:29 IST

  • Wpl First Hat trick: ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ న‌మోదైంది. శుక్ర‌వారం జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ముంబై బౌల‌ర్ ఇసాబెల్లే వాంగ్ హ్యాట్రిక్‌తో మెరిసింది.

ఇస్సీ వాంగ్
ఇస్సీ వాంగ్

ఇస్సీ వాంగ్

Wpl First Hat trick: ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ న‌మోదైంది. ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్ ఇస్సీ వాంగ్ ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి ప్లేయ‌ర్‌గా నిలిచింది. హ్యాట్రిక్‌తో ముంబై ఇండియ‌న్స్‌ను ఫైన‌ల్ చేర్చింది వాంగ్‌. శుక్ర‌వారం జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో యూపీ వారియ‌ర్స్‌పై 72 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్ విజ‌యాన్ని సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 182 ప‌రుగులు చేసింది. సీవ‌ర్ బ్రంట్ 38 బాల్స్‌లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 72 ప‌రుగులు చేసి ముంబైకి భారీ స్కోరును అందించింది. చివ‌ర‌లో కెర్ 29 ప‌రుగుల‌తో రాణించింది. 183 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన యూపీ వారియ‌ర్స్‌కు ఇస్సీ వాంగ్ షాక్ ఇచ్చింది.

ఆరంభంలోనే వికెట్ల‌ను కోల్పోయిన యూపీ వారియ‌ర్స్ కిర‌ణ్ న‌విఘిరే మెరుపుల‌తో గాడిన ప‌డ్డ‌ట్టుగానే క‌నిపించింది. 27 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 43 ప‌రుగుల‌తో ధాటిగా ఆడుతోన్న కిర‌ణ్‌ను ఔట్ చేసిన వాంగ్ ముంబై ఇండియ‌న్స్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆ త‌ర్వాత రెండు బంతుల్లో వ‌రుస‌గా సిమ్ర‌న్‌, ఎకిల్‌స్టోన్‌ను ఔట్ చేసి ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్‌ను న‌మోదు చేసుకున్న‌ది.

ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవ‌ర్లు వేసిన వాంగ్ ప‌దిహేను ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్న‌ది. ఆమెతో పాటు సైకా ఇషాక్ రెండు వికెట్ల‌తో రాణించింది. వీరిద్ద‌రి బౌలింగ్ మెరుపుల‌తో యూపీ వారియ‌ర్స్ 17. 4 ఓవ‌ర్ల‌లో 110 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఈ విజ‌యంతో ఫైన‌ల్‌లో అడుగుపెట్టిన ముంబై ఇండియ‌న్స్ ఆదివారం రోజు టైటిల్ కోసం ఢిల్లీతో త‌ల‌ప‌డ‌బోతున్న‌ది.

టాపిక్