తెలుగు న్యూస్  /  Sports  /  Yashasvi Jaiswal Beats Samson Gill And Prithvi Shaw In Ipl

Yashasvi Jaiswal IPL record: అదరగొట్టిన యశస్వీ.. శుభ్‌మన్, సంజూ శాంసన్ రికార్డు బ్రేక్

07 May 2023, 21:32 IST

    • Yashasvi Jaiswal IPL record: రాజస్థాన్ రాయల్స్ యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. అతి చిన్న వయసులో ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గిల్, పృథ్వీషా, సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లను అధిగమించాడు.
యశస్వి జైస్వాల్
యశస్వి జైస్వాల్ (PTI)

యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal IPL record: రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌లో అత్యుత్తమంగా ఆడుతున్న అతడు అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన యశస్వి.. 1000 పరుగుల క్లబ్‌లో చేరిపోయాడు. ఈ ఘనత సాధించిన రెండో అతి పిన్న వయస్కుడిగా యశస్వి రికార్డు సృష్టించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

యశస్వి 34 ఇన్నింగ్సుల్లోనే 1000 పరుగుల మార్కును అందుకున్నాడు. అంతేకాకుండా 21 ఏళ్ల 130 రోజుల వయసులో యశస్వి ఈ రికార్డు అందుకోగా.. రిషభ్ పంత్ 20 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి అతడి కంటే ముందున్నాడు. అయితే పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లను అధిగమించి రెండ స్థానంలో నిలిచాడు యశస్వీ.

ఐపీఎల్‌లో అతి చిన్న వయసులో 1000 పరుగులు చేసిన ఆటగాళ్లు..

1. రిషభ్ పంత్- 20 ఏళ్ల 218 రోజులు

2. యశస్వీ జైస్వాల్- 21 రోజుల 130 రోజులు

3. పృథ్వీ షా- 21 ఏళ్ల 169 రోజులు

4. సంజూ శాంసన్- 21 ఏళ్ల 183 రోజులు

5. శుభ్‌మన్ గిల్- 21 ఏళ్ల 222 రోజులు.

యశస్వీ జైస్వాల్ 2020 నుంచి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2020 అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు ఐపీఎల్‌కు ఆడాడు. అయితే గత ఐపీఎల్ సీజన్‌ నుంచి లైమ్ లైట్‌లోకి వచ్చిన అతడు.. ప్రస్తుతం రాజస్థాన్ జట్టులో కీలకంగా మారాడు. ఈ సీజన్‌లో అయితే ఏకంగా 11 మ్యాచ్‌ల్లో 477 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. 511 పరుగులతో ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్ తొలి స్థానంలో ఉన్నాడు.

ఇంక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 214 పరుగులను చేసింది. ఓపెనర్ జాస్ బట్లర్(95), కెప్టెన్ సంజూ శాంసన్(66) అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకోగా.. యశస్వీ జైస్వాల్ 35 పరుగులతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జన్సెన్‌కు చెరో వికెట్ పడింది.