తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mi Vs Gt Ipl 2023 Qualifier 2: వర్షం కారణంగా క్వాలిఫయర్-2 మ్యాచ్‌ రద్దయితే ఫైనల్‌కు ఎవరు వెళ్తారు?

MI vs GT IPL 2023 Qualifier 2: వర్షం కారణంగా క్వాలిఫయర్-2 మ్యాచ్‌ రద్దయితే ఫైనల్‌కు ఎవరు వెళ్తారు?

26 May 2023, 19:57 IST

    • MI vs GT IPL 2023 Qualifier 2: ముంబయి-గుజరాత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వరణుడు అంతరాయం కలిగించాడు. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే ఫైనల్‌కు ఎవరిని పంపిస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.
క్వాలిఫయర్స్ మ్యాచ్ రద్దయితే ఎవరినీ ఫైనల్‌కు పంపుతారు
క్వాలిఫయర్స్ మ్యాచ్ రద్దయితే ఎవరినీ ఫైనల్‌కు పంపుతారు (PTI)

క్వాలిఫయర్స్ మ్యాచ్ రద్దయితే ఎవరినీ ఫైనల్‌కు పంపుతారు

MI vs GT IPL 2023 Qualifier 2: ముంబయి ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లి చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. అయితే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వరణుడు అంతరాయంగా మారాడు. ఫలితంగా టాస్ కూడా ఆలస్యమైంది. లీగ్ దశలో వర్షం అడ్డుపడి మ్యాచ్ ఆగిపోతే చెరోక పాయింట్ ఇచ్చేసి టైగా ముగుస్తారు. ఒకవేళ ఈ క్వాలిఫయర్-2 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయితే ఏం జరుగుతుంది? ఎవరిని ఫైనల్‌కు పంపుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఫైనల్‌కు ఎవరికి వెళ్లాలనేదానిపై కీలకమైన ఈ మ్యాచ్‌కు వర్షం కారణంగా రద్దయితే లీగ్ దశలో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచ అత్యధిక పాయిట్లున్న జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. ఈ ప్రకారం చూస్తే గుజరాత్ టైటాన్స్ తుదిపోరుకు వెళ్లే అవకాశముంటుంది. లీగ్ దశలో గుజరాత్ జట్టు 10 విజయాలు సాధించి 20 పాయింట్లు కైవసం చేసుకుంది. మరోపక్క 8 మ్యాచ్‌ల్లో గెలిచిన ముంబయి ఇండియన్స్ 16 పాయింట్లే సాధించింది. ఫలితంగా వర్షం కారణంగా ఆట జరగని పక్షంలో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

వీలైనంత వరకు రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ వరకైనా జరిగేలా చూస్తారు. అది కూడా సాధ్యం కాని పక్షంలో ఎక్కువ పాయింట్లున్న గుజరాత్‌ను ఫైనల్‍‌కు పంపుతారు. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించిన ముంబయి రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. అంతకుముందు మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్‌పై చెన్నై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లుంది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ గుజరాత్-ముంబయి మధ్య జరుగుతుంది.

ఐపీఎల్ 2023 రూల్స్ ఏం చెబుతున్నాయి?

"ఎలిమినేటర్ మ్యాచ్‌తో పాటు క్వాలిఫయర్ మ్యాచ్‌లు నిర్వహించడానికి సాధ్యం కాకపోతే అదనపు సమయం ఇవ్వాలి. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరిగేలా చూడాలి. పరిస్థితులను అనుసరించి కనీసం సూపర్ ఓవర్ అయినా నిర్వహించాలి. ఇందుకోసం పిచ్, మైదానాన్ని సిద్ధం చేయాలి. 12.50 గంటలలోపు సూపర్ ఓవర్‌ను ప్రారంభించవచ్చు. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాని పక్షంలో 70 మ్యాచ్‌లో ఐపీఎల్ రెగ్యూలర్ సీజన్‌లో లీగ్ దశలో ఎవరైతే ఎక్కువ పాయింట్లు సాధిస్తారో ఆ టీమ్‌ను ప్లేఆఫ్స్ మ్యాచ్ లేదా ఫైనల్‌కు పంపించాలి." అని ఐపీఎల్ నియమావళిలో ఉంది.