తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Srh Vs Pbks: ధావ‌న్ సెంచ‌రీ మిస్ - హైద‌రాబాద్ ముందు పంజాబ్ ఈజీ టార్గెట్‌

SRH vs PBKS: ధావ‌న్ సెంచ‌రీ మిస్ - హైద‌రాబాద్ ముందు పంజాబ్ ఈజీ టార్గెట్‌

09 April 2023, 21:32 IST

  • SRH vs PBKS: సొంత గ‌డ్డ‌పై స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్లు చెల‌రేగారు. మ‌యాంక్ మార్కాండేతో ఉమ్రాన్ మాలిక్ విజృంభించ‌డంతో పంజాబ్ కింగ్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 143 ప‌రుగులు చేసింది. 99 ప‌రుగులు చేసిన పంజాబ్ కెప్టెన్ ధావ‌న్ తృటిలో సెంచ‌రీ మిస్స‌య్యాడు.

మ‌యాంక్ మార్కాండే
మ‌యాంక్ మార్కాండే

మ‌యాంక్ మార్కాండే

SRH vs PBKS: ఉప్ప‌ల్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతోన్న మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్లు విజృంభించారు. మ‌యాంక్ మార్కాండేతో పాటు ఉమ్రాన్ మాలిక్‌, జాన్స‌న్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో పంజాబ్ కింగ్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు న‌ష్ట‌పోయి 143 ప‌రుగులు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

పంజాబ్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ ఒంట‌రి పోరాటం చేయడంతో పంజాబ్ ఈ మాత్ర‌మైన స్కోరు చేయ‌గ‌లిగింది. 66 బాల్స్‌లో ఐదు సిక్స‌ర్లు 12 ఫోర్ల‌తో ధావ‌న్ 99 ర‌న్స్ చేశాడు. తృటిలో సెంచ‌రీ మిస్స‌య్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శిఖ‌ర్ ధావ‌న్‌తో పాటు సామ్ క‌ర‌న్ మాత్ర‌మే డ‌బుల్ డిజిట్ స్కోరు చేశారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్స్‌లో ముగ్గురు డ‌కౌట్ అయ్యారు.

88 ర‌న్స్‌కు 9 వికెట్లు కోల్పోవ‌డంతో పంజాబ్ వంద ప‌రుగులు దాట‌డం క‌ష్టంగానే క‌నిపించింది. కానీ చివ‌రి వికెట్‌కు మోహిత్ ర‌థీ అండ‌తో ధావ‌న్ పంజాబ్ స్కోరును 143 ప‌రుగుల‌కు చేర్చాడు.

చివ‌రి వికెట్‌కు ధావ‌న్‌, మోహిత్ క‌లిసి 55 ప‌రుగులు చేశారు. అందులో ధావ‌న్ వాటా 54 ప‌రుగులు కాగా మోహిత్ 1 ప‌రుగు మాత్ర‌మే చేశాడు. అలాగే పంజాబ్ స్కోరు 143 అయితే అందులో ధావ‌న్ చేసిన‌వే 99 ప‌రుగులు ఉన్నాయి. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అంద‌రూ క‌లిసి 44 ప‌రుగులు మాత్ర‌మే చేశారు.

హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో మ‌యాంక్ మార్కాండే నాలుగు వికెట్లు, ఉమ్రాన్ మాలిక్, జాన్స‌న్ త‌లో రెండు వికెట్లు తీసుకోగా భువ‌నేశ్వ‌ర్‌కు ఒక వికెట్ ద‌క్కింది.