తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhawan On Prabhsimran: అతడు అద్భుతం చేశాడు.. ప్రభ్‌సిమ్రాన్‌పై ధావన్ ప్రశంసలు.. పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

Dhawan on Prabhsimran: అతడు అద్భుతం చేశాడు.. ప్రభ్‌సిమ్రాన్‌పై ధావన్ ప్రశంసలు.. పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

14 May 2023, 6:05 IST

    • Dhawan on Prabhsimran: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో దిల్లీ 136 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి.
ప్రభ్ సిమ్రాన్ సింగ్
ప్రభ్ సిమ్రాన్ సింగ్ (Rahul Singh)

ప్రభ్ సిమ్రాన్ సింగ్

Dhawan on Prabhsimran: పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలు నిలిచాయి. దిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 31 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదనలో బరిలోకి దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్(103) ఒంటరి పోరాటం చేసి అద్భుతమైన సెంచరీతో తన జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అనంతరం బౌలర్లు కూడా రాణించడంతో దిల్లీపై పంజాబ్ అద్భుత విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ప్రభ్ సిమ్రాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ప్రభ్‌సిమ్రాన్ అద్భుతమైన ఆటను కనబర్చాడు. నాలుగో ఓవర్ నుంచి మ్యాచ్ టర్న్ అయింది. ప్రభ్ ఆటకు నేను హై రేటింగ్ ఇస్తాను. స్లో స్పిన్నర్ల బౌలింగ్‌లో అతడు ఆడిన కొన్ని షాట్లు సూపర్బ్. అద్భుత ఆటతీరుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు." అని శిఖర్ ధావన్ అన్నాడు.

"పంజాబ్ బౌలర్లు హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్‌‌కు కూడా ఈ విజయంలో క్రెడిట్ ఉందని ధావన్ అన్నాడు. మ్యాచ్ ఎక్కడకు వెళ్తుందాను ఆలోచిస్తున్నాను. మా బాయ్స్ అద్భుతంగా కమ్ బ్యాక్ ఇచ్చి మ్యాచ్ గాడిలో పెట్టారు. క్రెడిట్ అంతా ఇద్దరు యువ స్పిన్నర్లదే. హర్‌ప్రీత్ బ్రార్ చాలా బాగా ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల వికెట్లు చాలా అద్భుతంగా ఉంది." అని ధావన్ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్(103) అద్భుత సెంచరీతో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అతడు మినహా మిగిలినవారంతా విఫలమమయ్యారు. దిల్లీ బౌలర్లలో ఇషాంత్ 2 వికెట్లు తీయగా.. అక్షర్, ప్రవీణ్ దుబే, ముకేష్ కుమార్ తదితరులు తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనలో దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 136 పరుగులకే పరిమితమైంది. డేవడ్ వార్నర్(54), ఫిలిప్ సాల్ట్(21) మెరుగైన ఆరంభం ఇచ్చినప్పటికీ పంజాబ్ స్పిన్నర్ల ధాటికి దిల్లీ ఓటమిని చవిచూసింది. వార్నర్ అర్ధశతకంతో రాణించినప్పటికీ మిగిలినవారు విఫలం కావడంతో చేజేతులా మ్యాచ్‌ను సమర్పించుకుంది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 4 వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్ చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.