తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Fined Match Fee: దూకుడు త‌గ్గిస్తే మంచిది - కోహ్లిపై నెటిజ‌న్ల ఫైర్ - మ్యాచ్ ఫీజులో కోత‌

Kohli Fined Match Fee: దూకుడు త‌గ్గిస్తే మంచిది - కోహ్లిపై నెటిజ‌న్ల ఫైర్ - మ్యాచ్ ఫీజులో కోత‌

18 April 2023, 12:47 IST

  • Kohli Fined Match Fee: చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బెంగ‌ళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ ఫీజులో కోత ప‌డింది. ప‌దిశాతం మ్యాచ్ ఫీజ్ క‌ట్ చేసిన‌ట్లు బీసీసీఐ ప్ర‌క‌టించింది.

సిరాజ్ విరాట్ కోహ్లి
సిరాజ్ విరాట్ కోహ్లి

సిరాజ్ విరాట్ కోహ్లి

Kohli Fined Match Fee: సోమ‌వారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌, బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి సంబ‌రాలు శృతిమించ‌డంతో మ్యాచ్ ఫీజులో కోత ప‌డింది. ఐపీఎల్ నియ‌మ‌నిబంధ‌నల్ని ఉల్లంఘించ‌డంతో కోహ్లి మ్యాచ్ ఫీజులో ప‌ది శాతం క‌ట్ చేస్తోన్న‌ట్లు బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ లెవెల్ 1 ఆర్టిక‌ల్ 2.2 కింద కోహ్లికి ఈ జ‌రిమానా విధించిన‌ట్లు పేర్కొన్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అయితే కోహ్లి చేసిన త‌ప్పిదాన్ని మాత్రం బీసీసీఐ వెల్ల‌డించ‌లేదు. మ్యాచ్ రిఫ‌రీ నిర్ణ‌యం ఆధారంగానే కోహ్లి మ్యాచ్ ఫీజులో కోత విధించాల్సివ‌చ్చింద‌ని పేర్కొన్న‌ది. సోమ‌వారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి దూకుడుగా క‌నిపించాడు. చెన్నై బ్యాట‌ర్ శివ‌మ్ దూబే ఔట్ అయిన స‌మ‌యంలో కోహ్లి గాల్లో ఎగురుతూ సంబ‌రాలు చేసుకున్నాడు. ధాటిగా ఆడుతోన్న శివ‌మ్ దూబే ప‌దిహేడో ఓవ‌ర్‌లో పార్నెల్ బౌలింగ్‌లోసిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

దూబే ఔట్ కాగానే కోహ్లి ఆనందంతో సిరాజ్‌వైపు ప‌రిగెత్తాడు. ఇద్ద‌రు క‌లిసి గాలిలో గెంతుతూ సంబ‌రాలు చెసుకున్నారు. సిరాజ్‌, కోహ్లితో పాటు డుప్లెసిస్ కూడా ఆనందంతో అరిచాడు. అయితే వారి సంబ‌రాలు శృతిమించిన‌ట్లుగా అనిపించాయి. ముఖ్యంగా కోహ్లి కాస్త హ‌ద్దులు దాటాడు.

ఆ కార‌ణంగానే కోహ్లి మ్యాచ్ ఫీజులో కొత విధించిన‌ట్లుగా చెబుతోన్నారు.కోహ్లిపై నెటిజ‌న్లు కూడా ఫైర్ అవుతోన్నారు. సీనియ‌ర్ ప్లేయ‌ర్ అయివుండి ఇలా హ‌ద్దులు దాట‌డం బాగాలేద‌ని అంటోన్నారు. దూకుడు త‌గ్గిస్తే మంచిదంటూ కామెంట్స్ చేస్తోన్నారు.