Fans furious over BCCI: ఇంట్లో కూర్చున్న బుమ్రాకు కోట్లు ఎందుకు.. బీసీసీఐపై ఫ్యాన్స్ సీరియస్-fans furious over bcci for keeping bumrah in a plus category ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fans Furious Over Bcci: ఇంట్లో కూర్చున్న బుమ్రాకు కోట్లు ఎందుకు.. బీసీసీఐపై ఫ్యాన్స్ సీరియస్

Fans furious over BCCI: ఇంట్లో కూర్చున్న బుమ్రాకు కోట్లు ఎందుకు.. బీసీసీఐపై ఫ్యాన్స్ సీరియస్

Hari Prasad S HT Telugu
Mar 28, 2023 04:41 PM IST

Fans furious over BCCI: ఇంట్లో కూర్చున్న బుమ్రాకు కోట్లు ఎందుకు అంటూ బీసీసీఐపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. సోమవారం (మార్చి 27) బోర్డు సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకటించిన తర్వాత అభిమానులు ఫైర్ అయ్యారు.

ఉమ్రాన్, బుమ్రా, శిఖర్ ధావన్
ఉమ్రాన్, బుమ్రా, శిఖర్ ధావన్

Fans furious over BCCI: టీమిండియా ప్లేయర్స్ కు ప్రతి ఏటా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకటిస్తుందన్న విషయం తెలుసు కదా. తాజాగా సోమవారం (మార్చి 27) గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఈ కొత్త కాంట్రాక్టులను అనౌన్స్ చేసింది. మొత్తం 26 మంది ప్లేయర్స్ కు ఇందులో చోటు దక్కింది. వీళ్లను నాలుగు కేటగిరీలుగా విభజించి కాంట్రాక్టులు ఇచ్చారు.

ఈ తాజా లిస్టులో కొందరికి ప్రమోషన్, మరికొందరికి డిమోషన్ వచ్చింది. ఏడుగురు ప్లేయర్స్ కాంట్రాక్టులనే కోల్పోయారు. జడేజా, అక్షర్ పటేల్ లాంటి వాళ్లు ప్రమోషన్ పొందారు. రహానే, ఇషాంత్ మొత్తానికే కాంట్రాక్టులు కోల్పోయారు. అయితే ఈ కొత్త లిస్టు చూసిన అభిమానులు మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గాయపడి చాలా రోజులుగా టీమ్ కు దూరంగా ఉన్న బుమ్రాను ఏ+ కేటగిరీలోనే కొనసాగించడాన్ని వాళ్లు తప్పుబట్టారు.

గతేడాది సెప్టెంబర్ లో చివరి మ్యాచ్ ఆడిన బుమ్రా అప్పటి నుంచి గాయం కారణంగా దూరంగానే ఉన్నాడు. అలాంటి బుమ్రాను ఏ+లో కొనసాగించడం ఏంటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ గ్రేడ్ లో ఉన్న ప్లేయర్స్ కు ఏడాదికి రూ.7 కోట్లు చెల్లిస్తారు. ఇక పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు కాంట్రాక్ట్ ఇవ్వకపోవడాన్ని కూడా తప్పుబట్టారు.

అతనికి కాంట్రాక్ట్ ఇవ్వలేదంటే ఉమ్రాన్ వరల్డ్ కప్ టీమ్ లో లేడన్నేట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. ఉమ్రాన్ ఇప్పటి వరకూ ఇండియా తరఫున 16 వైట్ బాల్ మ్యాచ్ లు ఆడి 24 వికెట్లు తీసుకున్నాడు. అటు వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ గురించి కూడా అభిమానులు బోర్డు తీరును తప్పుబట్టారు. అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పించినా.. కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

ఇక హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ మూడు ఫార్మాట్లలో ఆడుతున్నా.. అతన్ని బీ గ్రేడ్ లో ఉంచడమేంటని అడిగారు. మరోవైపు జడేజాకు ప్రమోషన్ ఇవ్వడం, సంజూ శాంసన్ ను సెంట్రల్ కాంట్రాక్టుల్లోకి తీసుకోవడంపై మాత్రం ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం