తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table : కేకేఆర్ గెలుపు.. ఆర్సీబీ, ముంబయిపై ఎఫెక్ట్

IPL 2023 Points Table : కేకేఆర్ గెలుపు.. ఆర్సీబీ, ముంబయిపై ఎఫెక్ట్

Anand Sai HT Telugu

09 May 2023, 9:14 IST

google News
    • KKR vs PBKS : పంజాబ్ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ అద్భుతంగా విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో మార్పులు జరిగాయి. ఆర్సీబీ, ముంబయిపై ప్రభావం పడింది.
ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
ఐపీఎల్ పాయింట్స్ టేబుల్

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్

పంజాబ్ కింగ్స్‌పై కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్(PBKS Vs KKR) గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 180 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 182 పరుగులు చేసి విజయం సాధించింది.

ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్(kolkata knight riders) ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్ వెంటనే ఐదో స్థానానికి ఎగబాకింది. అలాగే ఐదో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఆరో స్థానానికి, ఆరో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఎనిమిదో స్థానానికి పడిపోయాయి. దీంతో కేకేఆర్ గెలుపుతో ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్ మీద ప్రభావం పడింది. మే 9న ఈ రెండు జట్ల మధ్య వాంఖడే వేదికగా మ్యాచ్ ఉంది.

పంజాబ్ కింగ్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించిన తర్వాత ఏ జట్టు ఎన్ని మ్యాచ్ ల్లో గెలిచింది, ఎన్ని పాయింట్లు, స్టాండింగ్స్ లో ఎక్కడుంది? అనే సమాచారం కింది విధంగా ఉంది.

1. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు గెలిచి 3 మ్యాచ్‌లు ఓడి 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

2. చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడి 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.

3. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఒక్క మ్యాచ్‌లో ఫలితం చూడలేదు.

4. రాజస్థాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిపోయి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది.

5. 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

6. 10 మ్యాచుల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 5 మ్యాచ్‌లు ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.

7. పంజాబ్ కింగ్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిపోయి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

8. ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 5 మ్యాచ్‌లు ఓడిపోయి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.

9. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడి 8 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది.

10. పది మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి, 6 మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది.

తదుపరి వ్యాసం