Sehwag on SRH vs KKR: మీపై ఎలాంటి అంచనాలూ లేవులే.. కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌పై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్-sehwag on srh vs kkr says no one has expectations from you ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sehwag On Srh Vs Kkr: మీపై ఎలాంటి అంచనాలూ లేవులే.. కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌పై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్

Sehwag on SRH vs KKR: మీపై ఎలాంటి అంచనాలూ లేవులే.. కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌పై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
May 04, 2023 08:44 PM IST

Sehwag on SRH vs KKR: మీపై ఎలాంటి అంచనాలూ లేవులే అంటూ కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌పై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు వీళ్లను 2007 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో ముడిపెట్టడం విశేషం.

సన్ రైజర్స్, నైట్ రైడర్స్ మ్యాచ్ పై వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సన్ రైజర్స్, నైట్ రైడర్స్ మ్యాచ్ పై వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (Getty/IPL)

Sehwag on SRH vs KKR: వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గురువారం (మే 4) జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ పై అతడు స్పందిస్తూ.. మీపై ఎలాంటి అంచనాలు లేవులే కానీ మీ ఆటను మీరు ఎంజాయ్ చేయండి అని అనడం విశేషం. ఐపీఎల్ 2023లో ఈ రెండు టీమ్స్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది.

ఈ నేపథ్యంలో సెహ్వాగ్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. అయితే అతడు మరీ నెగటివ్ రీతిలో ఈ కామెంట్స్ చేయలేదు. పైగా ఈ రెండు టీమ్స్ ను 2007 టీ20 వరల్డ్ కప్ లోని టీమిండియాతో పోల్చడం విశేషం. ఇలా ఎలాంటి అంచనా లేకుండా బరిలోకి దిగితే స్వేచ్ఛగా ఆడగలరని, దీంతో మ్యాచ్ లు గెలిచి క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయని సెహ్వాగ్ అన్నాడు.

2007 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అలాగే కప్పు గెలిచిందని చెప్పాడు. క్రిక్‌బజ్ తో మాట్లాడిన వీరూ ఈ కామెంట్స్ చేశాడు. "వరుస వైఫల్యాలు వచ్చినప్పుడు మీపై మీకు కూడా ఎలాంటి అంచనాలు ఉండవు. దానివల్ల ప్లేయర్స్ బరిలోకి దిగి స్వేచ్ఛగా ఆడే వీలుంటుంది. అలా మరింత మెరుగ్గా ఆడగలరు.

దానికి మంచి ఉదాహరణ 2007 టీ20 వరల్డ్ కప్ లో మేము ఆడిన తీరే. అప్పుడు మాపై ఎలాంటి అంచనాలు లేవు. కొత్త కెప్టెన్ సారథ్యంలోని కొత్త టీమ్ అది. మేము ఎంజాయ్ చేశాం. ఫోర్లు, సిక్సర్లు బాదాము. బౌలర్లు వికెట్లు తీశారు. ఫైనల్ గెలిచాం.

అందువల్ల ఎవరికీ మీపై ఎలాంటి అంచనాలు లేనప్పుడు మీరు కోల్పోయేది ఏమీ ఉండదు. మరింత స్వేచ్ఛగా ఆడి ఎంజాయ్ చేయగలరు. అలా క్వాలిఫికేషన్ కు మెరుగైన అవకాశాలు ఉంటాయి" అని సెహ్వాగ్ అనడం విశేషం.

ఐపీఎల్ 2023లో కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్ ముందు వరకూ చూస్తే.. కేకేఆర్ 9 మ్యాచ్ లలో కేవలం మూడు గెలిచింది. అటు సన్ రైజర్స్ 8 మ్యాచ్ లలో 3 గెలిచి, 5 ఓడిపోయారు.

సంబంధిత కథనం