Gavaskar on Dhoni: టీమిండియా కోచ్‌గా ధోనీ వస్తాడా.. గవాస్కర్ ఏమన్నాడో చూడండి-gavaskar on dhoni as team india coach says there should be a cooling off period ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gavaskar On Dhoni As Team India Coach Says There Should Be A Cooling Off Period

Gavaskar on Dhoni: టీమిండియా కోచ్‌గా ధోనీ వస్తాడా.. గవాస్కర్ ఏమన్నాడో చూడండి

Hari Prasad S HT Telugu
May 03, 2023 08:14 PM IST

Gavaskar on Dhoni: టీమిండియా కోచ్‌గా ధోనీ వస్తాడా? ఈ ప్రశ్నకు గవాస్కర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ఓ ప్లేయర్ రిటైరైన తర్వాత కనీసం మూడేళ్లకుగానీ కోచ్ లేదా ఇతర పదవిలో రాకూడదని అతడు అన్నాడు.

ఎమ్మెస్ ధోనీ
ఎమ్మెస్ ధోనీ (AP)

Gavaskar on Dhoni: ఇండియన్ క్రికెట్ పై ధోనీ ఎలాంటి ముద్ర వేశాడో అందరికీ తెలుసు. అతని కెప్టెన్సీలో ఇండియన్ టీమ్ అన్ని ఐసీసీ ట్రోఫీలు సొంతం చేసుకుంది. టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అతడు. మరి అలాంటి ప్లేయర్ టీమ్ కు కోచ్ గా వస్తే ఎలా ఉంటుంది? 2019 వరల్డ్ కప్ తర్వాత ఇండియన్ టీమ్ కు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ధోనీ.

ట్రెండింగ్ వార్తలు

2020, ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే 2021 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా అతడు టీమ్ తోపాటే ఉన్నాడు. అతడో మెంటార్ గా వ్యవహరించాడు. అయితే ధోనీయే పూర్తిస్థాయి కోచ్ గా వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చాలా మంది అభిమానులకు వచ్చింది. ఇదే ప్రశ్నను ఐపీఎల్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన సునీల్ గవాస్కర్ ను అడిగారు.

అయితే దీనికి సన్నీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. అతడు కోచ్ గా రావచ్చని, అయితే వచ్చే రెండేళ్లలో మాత్రం వద్దని అనడం విశేషం. దీని వెనుక కారణమేంటో కూడా గవాస్కర్ వివరించాడు. ధోనీ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత కోచింగ్ లాంటి బాధ్యతలు తీసుకునే ముందు కాస్త విరామం తీసుకోవాలని అతడు అన్నాడు.

"కొంతకాలం తర్వాత ధోనీ ఇండియన్ టీమ్ కోచింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు. నా వరకు ఇదే కరెక్ట్. ప్లేయర్ గా రిటైరైన తర్వాత టీమ్ లో ఏదైనా బాధ్యత చేపట్టే ముందు కాస్త విరామం ఉండాలని నేను అనుకుంటాను. అది సెలక్షన్ కమిటీ అయినా, మేనేజర్ అయినా, కోచ్ అయినా. కనీసం రెండు, మూడేళ్ల విరామం అయితే ఉండాలి. ఎందుకంటే మీర కలిసి ఆడిన ప్లేయర్స్ గురించే మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏ ప్లేయర్ కైనా మూడేళ్ల విరామం ఇచ్చిన తర్వాత దీనిని పరిశీలించాలి" అని గవాస్కర్ అన్నాడు.

మరోవైపు ఇదే తన చివరి ఐపీఎల్ అని వస్తున్న వార్తలపై ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. లక్నోతో మ్యాచ్ లో టాస్ సందర్భంగా హోస్ట్ మోరిసన్ ఇదే ప్రశ్న అడగగా.. ఇదే చివరి సీజన్ అని మీరే డిసైడయ్యారని అతడు అనడం విశేషం.

WhatsApp channel

సంబంధిత కథనం