IPL 2023: ఐపీఎల్ 2023లో దారుణంగా ఫెయిలైన స్టార్లు వీళ్లే-ipl 2023 failed stars from karthik to russel ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ipl 2023 Failed Stars From Karthik To Russel

IPL 2023: ఐపీఎల్ 2023లో దారుణంగా ఫెయిలైన స్టార్లు వీళ్లే

Apr 25, 2023, 09:21 PM IST Hari Prasad S
Apr 25, 2023, 09:21 PM , IST

  • IPL 2023: ఐపీఎల్ 2023లో దారుణంగా ఫెయిలైన స్టార్లు వీళ్లే. ఆయా టీమ్స్ కు ఎన్నో ఆశలు రేపిన ఈ ప్లేయర్స్.. ఈ సీజన్ లో చేతులెత్తేస్తున్నారు. దీంతో కీలకమైన సమయంలో ఆ టీమ్స్ బోల్తా పడుతున్నాయి.

IPL 2023: ఈ లిస్టులో ముందు ఉన్నది దినేష్ కార్తీక్. గతేడాది ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించి ఫినిషర్ గా పేరుగాంచిన కార్తీక్.. ఈ ఏడాది ఏడు మ్యాచ్ లలో ఐదుసార్లు పదిలోపు పరుగులకే ఔటయ్యాడు. అందులో రెండు డకౌట్స్ ఉన్నాయి. కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. 

(1 / 6)

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచుతున్నాడు పృథ్వీ షా. అతడు ఆరు ఇన్నింగ్స్ లో కేవలం 47 రన్స్ చేశాడు. రెండుసార్లు డకౌటయ్యాడు. మళ్లీ టీమిండియాలోకి రావాలని చూస్తున్న పృథ్వీకి ఇది ఏమాత్రం మింగుడుపడనిదే.

(2 / 6)

IPL 2023: చాలా ఏళ్లుగా కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు ఆండ్రీ రసెల్. కానీ ఈ ఏడాది మాత్రం అసలు అతని ఊసే లేదు. రసెల్ కు రూ.16 కోట్లు చెల్లిస్తున్న కేకేఆర్.. అతని వల్ల ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. అతడు ఈ సీజన్ లో చేసిన అత్యధిక పరుగులు 38. అంతకుముందు 35, 21 పరుగులు చేశాడు. అయితే ఈ మూడు మ్యాచ్ లలోనూ కేకేఆర్ ఓడిపోయింది.

(3 / 6)

IPL 2023: గతేడాది వేలంలో ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టి బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఈ సీజన్ లో అతడు గాయం కారణంగా చాలా వరకూ టీమ్ కు దూరంగానే ఉంటున్నాడు. మొదట్లో కొన్ని మ్యాచ్ లు ఆడినా.. ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

(4 / 6)

IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మయాంక్ అగర్వాల్ ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ లలో మయాంక్ 164 రన్స్ చేశాడు. రెండు మ్యాచ్ లలో 48, 49 పరుగులు చేసినా.. రెండుసార్లూ టీమ్ ను గెలిపించలేకపోయాడు.

(5 / 6)

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మిచెల్ మార్ష్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. ఐదు మ్యాచ్ లలో కేవలం 31 రన్స్ చేశాడు. అందులో రెండు డక్స్ ఉన్నాయి. ఇక బౌలింగ్ లోనూ కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. డీసీ టీమ్ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. అతడు తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు