Andre Russell on Ipl 2023: కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్‌గా ర‌సెల్?-andre russell likely to lead kolkata knight riders on ipl 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Andre Russell Likely To Lead Kolkata Knight Riders On Ipl 2023

Andre Russell on Ipl 2023: కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్‌గా ర‌సెల్?

Nelki Naresh Kumar HT Telugu
Mar 25, 2023 09:01 AM IST

Andre Russell on Ipl 2023: ఐపీఎల్ 2023 లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్సీలో మార్పు జ‌ర‌గ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శ్రేయ‌స్ అయ్య‌ర్ స్థానంలో ఆల్‌రౌండ‌ర్ ఆండ్రీ ర‌సెల్‌కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఆండ్రీ ర‌సెల్‌
ఆండ్రీ ర‌సెల్‌

Andre Russell on Ipl 2023: ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొత్త కెప్టెన్‌తో బ‌రిలో దిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తోన్నాయి. రెగ్యుల‌ర్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయంతో ఐపీఎల్ సీజ‌న్ మొత్తానికి దూర‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయ్య‌ర్ గాయంపై మ‌రో రెండు మూడు రోజుల్లో కోల్‌క‌తా యాజ‌మాన్యం క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఒక‌వేళ శ్రేయ‌స్ అయ్య‌ర్ దూర‌మైతే కెప్టెన్‌గా ఎవ‌రిని ఎంపిక‌చేయాల‌న్న‌ది కోల్‌క‌తా మేనేజ్‌మెంట్‌కు ఛాలెంజింగ్‌గా మారింది. కెప్టెన్సీలో న్యూజిలాండ్ పేస‌ర్ టీమ్ సౌథీ, బంగ్లా ఆల్ రౌండ‌ర్ ష‌కీబ్‌ల‌కు అనుభ‌వం ఉన్నా జ‌ట్టు కూర్పు దృష్ట్యా అన్ని మ్యాచ్‌లలో వారిని ఆడించ‌డం అనుమాన‌మే.

ఈనేప‌థ్యంలో హిట్ట‌ర్ ఆండ్రీ ర‌సెల్‌కు జ‌ట్టు ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని మేనేజ్‌మెంట్ భావిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త కొన్నేళ్లుగా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ ప‌రంగా కోల్‌క‌తాకు పెద్ద దిక్కుగా నిలుస్తోన్నాడు ర‌సెల్‌. ఈ సీజ‌న్‌లో కోల్‌క‌తా అత‌డిపైనే ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్న‌ది. ఈ నేప‌థ్యంలో అత‌డికే కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ప్రాక్టీస్ మొద‌లుపెట్టిన ర‌సెల్‌

ఐపీఎల్ 2023 సీజ‌న్ కోసం ర‌సెల్ ప్రాక్టీస్ మొద‌లుపెట్టాడు. శుక్ర‌వారం కొద్దిసేపు ఈడెన్ గార్డెన్స్‌లో బ్యాటింగ్ సాధ‌న చేశాడు. ఈ సంద‌ర్భంగా ఐపీఎల్ 2023 సీజ‌న్‌పై ర‌సెల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. మేనేజ్‌మెంట్‌తో పాటు కోల్‌క‌తా ఫ్యాన్స్‌ను త‌న ఆట‌తీరుతో సంతృప్తి ప‌రిచేందుకు కృషిచేస్తాన‌ని ర‌సెల్ అన్నాడు.

గ‌త సీజన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఈ సారి పున‌రావృతం చేస్తాన‌నే న‌మ్మ‌కం ఉంద‌ని తెలిపాడు. బ్యాట్‌తోనే తనస‌త్తా ఏమిటో చూపిస్తా. ఆ విష‌యంలో నేనో లెజెండ్‌లా ఫీల‌వుతా. ప్ర‌తి మ్యాచ్‌లో నా ఆట‌తీరుతో ప్రేక్ష‌కుల్ని ఉత్సాహ ప‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తుంటా. ఈ సారి నా ఆట‌ను చూడ‌టానికి సిద్ధంగా ఉండండి అంటూ ర‌సెల్ తెలిపాడు. గ‌త సీజ‌న్‌లో 174 స్ట్రైక్ రేట్‌తో 335 ర‌న్స్ చేశాడు ర‌సెల్‌.

WhatsApp channel

టాపిక్