Michael Vaughan on Rajastan Royals: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ రాజస్థాన్ రాయల్స్‌దే: మైఖేల్ వాన్-michael vaughan on rajastan royals says this time they will lift the trophy
Telugu News  /  Sports  /  Michael Vaughan On Rajastan Royals Says This Time They Will Lift The Trophy
కొత్త జెర్సీలతో రాజస్థాన్ రాయల్స్ టీమ్
కొత్త జెర్సీలతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ (PTI)

Michael Vaughan on Rajastan Royals: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ రాజస్థాన్ రాయల్స్‌దే: మైఖేల్ వాన్

30 March 2023, 15:49 ISTHari Prasad S
30 March 2023, 15:49 IST

Michael Vaughan on Rajastan Royals: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ రాజస్థాన్ రాయల్స్‌దే అంటున్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. 2022లో ఆర్ఆర్ టీమ్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Michael Vaughan on Rajastan Royals: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? సాధారణంగా ఏ సీజన్ ప్రారంభమవుతున్నా అందరి కళ్లూ ముంబై, చెన్నైలాంటి జట్లపైనే ఉంటాయి. అయితే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాత్రం 2023 ఐపీఎల్ ట్రోఫీ రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని అంటున్నాడు. గతేడాది గుజరాత్ టైటన్స్ చేతుల్లో ఓడిన రాయల్స్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే ఈసారి మాత్రం రాజస్థాన్ ఇయర్ లాగే కనిపిస్తోందని వాన్ గురువారం (మార్చి 30) ట్వీట్ చేశాడు. "ఐపీఎల్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. క్రిక్ బజ్ టీమ్ లో భాగం కాబోతున్నాను. ఇది రాజస్థాన్ రాయల్స్ ఏడాది అవుతుందని నేను అనుకుంటున్నాను. మే నెల చివర్లో ట్రోఫీని వాళ్లే అందుకోబోతున్నారు" అని వాన్ ట్వీట్ చేశాడు.

సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ టీమ్ పటిష్ఠంగా కనిపిస్తోంది. గతేడాది జోస్ బట్లర్ వీర విహారంతో ఆ టీమ్ ఫైనల్ వరకూ వచ్చింది. అతడు 17 మ్యాచ్ లలో ఏకంగా 863 రన్స్ చేశాడు. 2022లో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ బట్లరే కాగా.. ఓవరాల్ గా కూడా ఒక సీజన్ లో అత్యధిక స్కోరు చేసిన వాళ్లలో విరాట్ కోహ్లి (973) తర్వాతి స్థానం అతనిదే.

అయితే 2022 ఐపీఎల్ ఫైనల్లో మాత్రం గుజరాత్ టైటన్స్ చేతుల్లో రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు. గతేడాదే లీగ్ లో అడుగుపెట్టిన గుజరాత్ టీమ్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఎవరూ ఊహించని విధంగా టైటిల్ ఎగరేసుకుపోయింది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ ను వార్న్ కెప్టెన్సీలో గెలిచిన రాయల్స్.. గతేడాది దగ్గరగా వచ్చినా అందుకోలేకపోయింది.

ఈసారి రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్ ను ఆదివారం (ఏప్రిల్ 2) సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనుంది. రాజస్థాన్ బ్యాటింగ్ లో బట్లర్, సంజూ శాంసన్ తోపాటు దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మయర్, రియాన్ పరాగ్, జో రూట్ లపై ఆధార పడగా.. బౌలింగ్ లో అశ్విన్, బౌల్ట్, చహల్, ప్రసిద్ధ్ కృష్ణలాంటి వాళ్లు ఉన్నారు.

సంబంధిత కథనం