IPL 2023 Crucial for this Players: ఈ ఐపీఎల్ వీరికి కలిసొస్తుందా.. కాలరాస్తుందా? రాణిస్తేనే రాగలరు-ipl 2023 will be a crucial for three indian players ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Crucial For This Players: ఈ ఐపీఎల్ వీరికి కలిసొస్తుందా.. కాలరాస్తుందా? రాణిస్తేనే రాగలరు

IPL 2023 Crucial for this Players: ఈ ఐపీఎల్ వీరికి కలిసొస్తుందా.. కాలరాస్తుందా? రాణిస్తేనే రాగలరు

Maragani Govardhan HT Telugu
Mar 30, 2023 11:43 AM IST

IPL 2023 Crucial for this Players: ఐపీఎల్ 2023 కొంతమంది ఆటగాళ్లకు చాలా కీలకం కానుంది. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న ముగ్గురు ఆటగాళ్లు.. ఈ సీజన్‌లో రాణిస్తేనే తిరిగి వారికి అవకాశాలొస్తాయి. లేకుంటే వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది.

ఈ ఐపీఎల్ వీరికి కీలకం
ఈ ఐపీఎల్ వీరికి కీలకం

IPL 2023 Crucial for this Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) 16వ ఎడిషన్ ప్రారంభానికి ఇంకొక్క రోజే ఉంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్లంతా కలిసి ఆడే ఈ టోర్నీ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. క్రికెట్‌ను ప్రపంచ నలు దిశలా వ్యాప్తి చేసిన ఖ్యాతి ఐపీఎల్‌కే దక్కుతుంది. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఇక్కడ నుంచే పుట్టారు. ఇప్పటి వరకు 15 సీజన్లు ప్రేక్షకులను అలరించిన ఈ టోర్నీ 16వ సీజన్ ఆరంభం కానుంది. అయితే ఈ సారి మాత్రం కొంతమంది ఆటగాళ్లకు వారి భవిష్యత్తును నిర్వచించనుంది. మెరుగైన ప్రదర్శన చేస్తేనే వారి కెరీర్‌కు బూస్ట్‌ను ఇస్తుంది. లేదంటే ఇదే వారికి ఇబ్బంది కలిగించనుంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లకు ఈ ఐపీఎల్ చావో, రేవోగా మారింది. వారెవరో ఇప్పుడు చూద్దాం.

మనీష్ పాండే..

మనీష్ పాండే బ్యాటర్‌గా తన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించలేదనే చెప్పాలి. ఈ ఐపీఎల్ మాత్రం అతడి కెరీర్‌ను డిసైడ్ చేయనుంది. గత మూడు సీజన్లుగా 30 మ్యాచ్‌లు ఆడిన అతడు క124.03 స్ట్రైక్ రేటుతో కేవలం 805 పరుగులే చేశాడు. ముఖ్యంగా గత సీజన్ అతడికి చాలా క్లిష్టతరంగా సాగింది. ఆరు మ్యాచ్‌ల్లో 110 స్ట్రైక్ రేటుతో 88 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. దిల్లీ.. మనీష్‌ను 2.4 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అనుభవజ్ఞుడైన ఈ బ్యాటర్ ఈ సీజన్‌తోనే తన భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేస్తే అతడి ప్రొఫైల్ మరింత దెబ్బతింటుంది. ఇదే చివరి సీజన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు

అజింక్య రహానే..

రహానే కెరీర్‌ ఇటీవల కాలంలో బాగా దిగజారుతూ వస్తోంది. టీమిండియా టెస్టు జట్టులో చోటు కోల్పోవడం దగ్గర నుంచి ఇటీవల బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ లిస్టులో అతడిని తొలగించడం వరకు చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్లేయర్‌గానూ అతడు చాలా వెనకబడ్డాడు. ఈ ఏడాది అతడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ మినీ వేలంలో రహానేను అతడి కనీస ధర రూ.50 లక్షలకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. 2020 నుంచి రహానే ఐపీఎల్‌లో పెద్దగా ప్రదర్శన చేసింది లేదు. కేవలం 18 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతడు 104.52 పూర్ స్ట్రైక్ రేటుతో 254 పరుగులు మాత్రమే చేశాడు. మరి ఐపీఎల్ 2023 అయినా అతడికి కలిసొస్తుందో లేక కెరీర్‌ను కాలరాస్తుందో వేచి చూడాలి.

జయదేవ్ ఉనాద్కట్..

దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జదేవ్ ఉనాద్కట్.. ఐపీఎల్‌లో మాత్రం అదే ఫామ్‌ను పునరావృతం చేయలేకపోయాడు. 2018 నుంచి అతడు ఐపీఎల్‌లో 44 మ్యాచ్‌లు ఆడి కేవలం 35 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఇది కూడా చాలా ఎక్కువ ఎకానమీ రేటుతో వికెట్లు తీశాడు. గత ఐదు సీజన్లలో ఉనాద్కట్ బెస్ట్ ఎకానమీ రేటుతో 2021లో బౌలింగ్ చేశాడు. ఓవర్‌కు 7.63 పరుగులు ఇచ్చాడు. ఆ ఏడాది ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మిగిలిన నాలుగు సీజన్లలో 9.50 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. 31 ఏళ్ల ఉనాద్కట్‌ను అతడి కనీస ధర రూ.50 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది ప్రదర్శన బట్టి అతడి భవితవ్యం ఆధారపడి ఉంది. లేకుంటే అవకాశాలు పెద్దగ లేకపోవచ్చు.

Whats_app_banner

టాపిక్