తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Pandya Ipl Record: ఐపీఎల్ చరిత్రలోనే హార్దిక్ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన నిలిచిన ఆల్ రౌండర్

Hardik Pandya IPL Record: ఐపీఎల్ చరిత్రలోనే హార్దిక్ అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన నిలిచిన ఆల్ రౌండర్

16 April 2023, 21:38 IST

    • Hardik Pandya IPL Record: హార్దిక్ పాండ్య అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 2 వేల పరుగులతో పాటు 50 వికెట్లు తీసిన ఆరో ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫలితంగా దిగ్గజాల సరసన నిలిచాడు.
హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య (AFP)

హార్దిక్ పాండ్య

Hardik Pandya IPL Record: ఐపీఎల్ 2023 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించిన గుజరాత్.. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌తో ఐదో మ్యాచ్ ఆడుతోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య తన ఆటతీరుతో పాటు కెప్టెన్సీ ప్రతిభతో జట్టుకు అద్భుత విజయాన్ని అందిస్తున్నాడు. తాజాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 2 వేల పరుగులతో పాటు 50 వికెట్లు తీసిన ఆల్ రౌండర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఐపీఎల్‌ కెరీర్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్.. 2012 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్ధశతకాలు ఉన్నాయి. అంతేకాకుండా 50 వికెట్లు పడగొట్టాడు. 29 ఏళ్ల 187 రోజుల వయసున్న పాండ్య 2 వేల పరుగుల మైలురాయితో పాటు 50 వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఆరో ఆల్ రౌండర్‌గా హార్ధిక్ నిలిచాడు.

హార్దిక్ కంటే ముందు ఈ ఘనత సాధించిన వారిలో షేన్ వాట్సన్ ముందున్నాడు. అతడు 32 ఏళ్ల 330 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. మొత్తంగా 3874 పరుగులు, 92 వికెట్లు పడగొట్టాడు. అతడి తర్వాత కీరన్ పోలార్డ్ 29 ఏళ్ల 334 రోజుల్లో ఈ రికార్డు దక్కించుకున్నాడు. అతడు మొత్తంగా 3412 పరుగులు, 69 వికెట్లు తీశాడు. ఆ తర్వార రవీంద్ర జడేజా 31 ఏళ్ల 301 రోజుల వయస్సులో ఈ ఘనత అందుకున్నాడు. మొత్తంగా 2531 పరుగులు, 138 వికెట్లు తీశాడు. అనంతరం జాకస్ కల్లీస్ 37 ఏళ్ల 177 రోజుల వయస్సులో తీశాడు. అతడు 2427 పరుగులు, 65 వికెట్లు పడగొట్టాడు. చివరగా ఆండ్రూ రసెల్34 ఏళ్ల 15 రోజుల వయస్సులో సాధించాడు. అతడు 2074 పరుగులు, 92 వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్(45), డేవిడ్ మిల్లర్(46) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ మెరుగైన స్కోరు చేయగలిగింది. హార్దిక్ పాండ్య(28) ఓ మోస్తరుగా రాణించాడు. ఇంక రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు తీయగా.. చాహల్, బౌల్ట్, ఆడం జంపా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.