తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Schedule Released As The League To Start On March 31st

IPL 2023 Schedule: ఐపీఎల్ 2023 షెడ్యూల్ ఇదీ.. ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే..?

Hari Prasad S HT Telugu

17 February 2023, 17:37 IST

    • IPL 2023 Schedule: ఐపీఎల్ 2023 షెడ్యూల్ రిలీజైంది. ఈ ఏడాది మళ్లీ హోమ్, అవే పద్ధతిలో మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం 12 వేదికల్లో ఈ సీజన్ మ్యాచ్ లు జరగనున్నాయి.
ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది
ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది

ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది

IPL 2023 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 షెడ్యూల్ ను శుక్రవారం (ఫిబ్రవరి 17) విడుదల చేసింది బీసీసీఐ. ఈసారి ఈ మెగా లీగ్ మార్చి 31న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. మార్చి 31న రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ప్రతి టీమ్ సొంతగడ్డపై ఏడు, బయట మరో ఏడు మ్యాచ్ లు ఆడతాయి. మొత్తం 12 వేదికల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. అహ్మదాబాద్ తో పాటు హైదరాబాద్, మొహాలీ, లక్నో, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గువాహటి, ధర్మశాలలో ఐపీఎల్ 2023 మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తంగా 52 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్ లు ఉంటాయి. అందులో 18 డబుల్ హెడర్స్ ఉంటాయి.

లీగ్ స్టేజ్ మే 21న ముగుస్తుంది. మే 28న ఫైనల్ జరుగుతుంది. పది జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. గ్రూప్ ఎలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఇక గ్రూప్ బిలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ ఉన్నాయి.

ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్ సందర్భంగా 1000వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుండటం విశేషం. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మే 6వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది.