తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Matches In Hyderabad: ఐపీఎల్ 2023లో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఇవే..

IPL 2023 matches in Hyderabad: ఐపీఎల్ 2023లో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఇవే..

Hari Prasad S HT Telugu

17 February 2023, 19:09 IST

    • IPL 2023 matches in Hyderabad: ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్‌లో మొత్తం ఏడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈసారి మళ్లీ హోమ్, అవే పద్ధతిలో టోర్నీ జరగనుండటంతో ఐపీఎల్ మ్యాచ్ లు చూసే అవకాశం భాగ్యనగర ప్రేక్షకులకు దక్కింది.
ఉప్పల్ స్టేడియానికి తిరిగి వస్తున్న సన్ రైజర్స్
ఉప్పల్ స్టేడియానికి తిరిగి వస్తున్న సన్ రైజర్స్

ఉప్పల్ స్టేడియానికి తిరిగి వస్తున్న సన్ రైజర్స్

IPL 2023 matches in Hyderabad: చాలా రోజుల తర్వాత మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హైదరాబాద్‌కు తిరిగి వస్తోంది. గత మూడు సీజన్లుగా కరోనా కారణంగా ఈ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోయింది. అయితే ఈసారి ఉప్పల్ స్టేడియం మరోసారి ఐపీఎల్ అభిమానుల కేరింతలతో మురిసిపోనుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. గతేడాది 8వ స్థానంలో నిలిచి నిరాశ పరిచిన సన్ రైజర్స్.. ఈసారి సొంతగడ్డపై చెలరేగాలని చూస్తోంది. సన్ రైజర్స్ టీమ్ గ్రూప్ బిలో ఉంది. ఐపీఎల్ 2023 మార్చి 31న ప్రారంభం కానుంది. మే 28న ఫైనల్ జరుగుతుంది. హైదరాబాద్ లో ఈసారి ఏప్రిల్ 2, 9, 18, 24, మే 4, 13, 18 తేదీలలో జరుగుతాయి.

సన్ రైజర్స్ షెడ్యూల్ ఇదీ

ఏప్రిల్ 2 - సన్ రైజర్స్ vs రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్

ఏప్రిల్ 7 - లక్నో సూపర్ జెయింట్స్ vs సన రైజర్స్, లక్నో

ఏప్రిల్ 9 - సన్ రైజర్స్ vs పంజాబ్ కింగ్స్, హైదరాబాద్

ఏప్రిల్ 14 - కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్ రైజర్స్, కోల్‌కతా

ఏప్రిల్ 18 - సన్ రైజర్స్ vs ముంబై ఇండియన్స్, హైదరాబాద్

ఏప్రిల్ 21 - చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్, చెన్నై

ఏప్రిల్ 24 - సన్ రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్

ఏప్రిల్ 29 - ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్ రైజర్స్, ఢిల్లీ

మే 4 - సన్ రైజర్స్ vs కోల్‌కతా నైట్ రైజర్స్, హైదరాబాద్

మే 7 - రాజస్థాన్ రాయల్స్ vs సన్ రైజర్స్, జైపూర్

మే 13 - సన్ రైజర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, హైదరాబాద్

మే 15 - గుజరాత్ టైటన్స్ vs సన్ రైజర్స్, అహ్మదాబాద్

మే 18 - సన్ రైజర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్

మే 21 - ముంబై ఇండియన్స్ vs సన్ రైజర్స్, ముంబై