తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Sri Lanka 3rd T20i: టాస్ గెలిచిన భారత్.. శ్రీలంక బౌలింగ్

India vs Sri Lanka 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. శ్రీలంక బౌలింగ్

07 January 2023, 18:34 IST

    • India vs Sri Lanka 3rd T20I: రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్. ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ (AFP)

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

India vs Sri Lanka 3rd T20I: శ్రీలంకతో జరుగుతున్న ఆఖరుదైన మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఇరుజట్లు ప్రస్తుతం చెరో గెలుపుతో 1-1తో సమంగా ఉన్నాయి. కీలకమైన ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరుజట్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా.. రెండో టీ20లో చివరి వరకు పోరాడి పరాజయం పాలైంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

టీమిండియా ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగుతోంది. మరోపక్క శ్రీలంక ఓ మార్పు చేసింది. భానుక రాజపక్స స్థానంలో అవిష్క ఫెర్నాండోకు అవకాశం కల్పించింది లంక జట్టు.

రెండో టీ20 మ్యాచ్‌లో బౌలింగ్‌లో విఫ‌ల‌మైనా బ్యాటింగ్‌లో మిడిల్ ఆర్డ‌ర్ గొప్ప‌గా పోరాడ‌టంతో గెలుపు వ‌ర‌కు వ‌చ్చి ఓట‌మి పాలైంది టీమ్ ఇండియా. ఆ పొర‌పాట్ల‌ను స‌రిదిద్దుకోవ‌డంపై టీమ్ ఇండియా దృష్టిసారించింది. ఈ సిరీస్‌లో టాప్ ఆర్డ‌ర్ వైఫ‌ల్యం టీమ్ ఇండియాను క‌ల‌వ‌ర‌పెడుతోంది.

శుభ్‌మ‌న్‌గిల్ రెండు మ్యాచ్‌ల‌లో పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు. రెండో టీ20తో అరంగేట్రం చేసిన రాహుల్ త్రిపాఠి ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు. ఇషాన్ కిష‌న్ తొలి టీ20లో ప‌ర్వాలేద‌నిపించిన రెండో టీ20లో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. ఈ ముగ్గురు రాణిస్తేనే నేటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి.

మరోపక్క రెండో టీ20లో ఐదు నోబాల్స్ వేయ‌డంతో పాటు ధారాళంగా ప‌రుగులు ఇచ్చిన అర్ష‌దీప్‌సింగ్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్నాయి.

తుది జట్లు..

భారత్..

ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్య(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్

శ్రీలంక..

పాథుమ్ నిశాంక, కుశాల్ మెండీస్, ధనంజయ డిసిల్వా, ఛరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, దసున్ శనక(కెప్టెన్), వానిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుశనక.