తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Aus 2nd Test: రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా గ్రాండ్‌ విక్ట‌రీ - సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో రోహిత్ సేన‌

IND vs AUS 2nd Test: రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా గ్రాండ్‌ విక్ట‌రీ - సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో రోహిత్ సేన‌

19 February 2023, 14:00 IST

  • IND vs AUS 2nd Test: రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. నాలుగు మ్యాచ్‌ల బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడాతో రోహిత్ సేన ఆధిక్యంలో  నిలిచింది.

రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా

IND vs AUS 2nd Test: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది టీమ్ ఇండియా. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన సెకండ్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో రోహిత్ సేన ఘ‌న విజ‌యాన్ని సాధించింది. మ‌రోసారి స్పిన్ ద్వ‌యం ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ టీమ్ ఇండియా విజ‌యంలో కీల‌క భూమిక పోషించారు. వారిద్ద‌రి బౌలింగ్ మెరుపుల‌తో మూడు రోజుల్లోనే సెకండ్ టెస్ట్ మ్యాచ్ ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

జ‌డేజా ఏడు వికెట్ల‌తో మెర‌వ‌డంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవ‌లం 113 ప‌రుగుల‌కే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఒక ప‌రుగు ఆధిక్యంతో క‌లుపుకొని టీమ్ ఇండియా ముందు 115 ప‌రుగుల టార్గెట్‌ను విధించింది. సింపుల్ టార్గెట్‌ను టీమ్ ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

రాహుల్ మ‌రోసారి విఫ‌లం

ఓపెన‌ర్ కె.ఎల్ రాహుల్ మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. కేవ‌లం 1 ర‌న్ మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. టీ20 స్టైల్‌లో దూకుడుగా ఆడిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఇర‌వై బాల్స్‌లోనే రెండు సిక్స‌ర్లు, మూడు ఫోర్ల‌తో 31 ప‌రుగులు చేసి ర‌నౌట‌య్యాడు. కోహ్లి (20 ర‌న్స్‌), శ్రేయ‌స్ అయ్య‌ర్ (12 ర‌న్స్‌) త‌క్కువ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

కానీ పుజారా, వికెట్ కీపర్ భ‌ర‌త్ క‌లిసి మ‌రో వికెట్ ప‌డ‌కుండా అడ్డుకోవ‌డ‌మే కాకుండా టీమ్ ఇండియాకు విజ‌యాన్ని అందించారు. పుజారా 31 ర‌న్స్‌, భ‌ర‌త్ 23 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో నాథ‌న్ ల‌య‌న్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

జ‌డేజా ప‌ది వికెట్లు...

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 ప‌రుగులు చేయ‌గా ఇండియా 262 ర‌న్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో జ‌డేజా తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు మొత్తంగా ప‌ది వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండు ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు ద‌క్కాయి.నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది