తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sa 3rd Odi: చెలరేగిన కుల్దీప్‌.. 99 రన్స్‌కే సౌతాఫ్రికా ఆలౌట్‌

Ind vs SA 3rd ODI: చెలరేగిన కుల్దీప్‌.. 99 రన్స్‌కే సౌతాఫ్రికా ఆలౌట్‌

Hari Prasad S HT Telugu

11 October 2022, 16:55 IST

    • Ind vs SA 3rd ODI: ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా కేవలం 99 రన్స్‌కే కుప్పకూలింది. కుల్దీప్‌ యాదవ్‌ చెలరేగడంతో సఫారీలు 27 ఓవర్లలోనే మూడంకెల స్కోరు కూడా అందుకోలేక చాప చుట్టేశారు.
మూడో వన్డేలో చెలరేగిపోయిన ఇండియన్ బౌలర్లు
మూడో వన్డేలో చెలరేగిపోయిన ఇండియన్ బౌలర్లు (PTI)

మూడో వన్డేలో చెలరేగిపోయిన ఇండియన్ బౌలర్లు

Ind vs SA 3rd ODI: సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్‌ 27.1 ఓవర్లలో కేవలం 99 రన్స్‌కు ఆలౌటైంది. వన్డేల్లో ఇండియాపై సౌతాఫ్రికాకు ఇదే అతి తక్కువ స్కోరు కావడం విశేషం. టీమిండియా బౌలర్లంతా చెలరేగిపోయారు. కుల్దీప్‌ 4, సుందర్‌, సిరాజ్‌, షాబాజ్‌ తలా రెండు వికెట్లు తీశారు.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

సౌతాఫ్రికా చివరి 6 వికెట్లను కేవలం 33 పరుగుల తేడాలో కోల్పోవడం విశేషం. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌ 34 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మలన్‌ 15, యాన్సెన్‌ 14 రన్స్‌ చేయగా.. మిగతా ఏ బ్యాటర్‌ కూడా రెండంకెల స్కోరు అందుకోలేకపోయాడు. మూడో ఓవర్లో ఓపెనర్‌ డికాక్‌ (6) వికెట్‌ కోల్పోయిన ఆ టీమ్‌.. తర్వాత కోలుకోలేకపోయింది.

వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. హెండ్రిక్స్‌ (3), మార్‌క్రమ్‌ (9), మిల్లర్‌ (7), విఫలమయ్యారు. మూడో ఓవర్లో డికాక్‌ను ఔట్‌ చేసి సుందర్‌ ఇండియన్‌ టీమ్‌కు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత సిరాజ్‌ రెండు వికెట్లు తీసి సఫారీలను దెబ్బ తీశాడు. ఇక టెయిలెండర్లను కుల్దీప్‌ ఔట్‌ చేశాడు. వన్డేల్లో సౌతాఫ్రికాకు ఇండియాపై ఇదే అత్యల్ప స్కోరు కాగా.. ఓవరాల్‌గా ఈ ఫార్మాట్‌లో నాలుగో అత్యల్ప స్కోరు.

ఆ టీమ్‌ 1993లో ఆస్ట్రేలియాపై 63 రన్స్‌కే ఆలౌట్‌ కాగా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 2008లో ఒకసారి, 2022లో మరోసారి 83 రన్స్‌కే ఆలౌటైంది. ఆ తర్వాత 100లోపు స్కోరుకు చాప చుట్టేయడం ఈసారే.