తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gunathilaka Granted Bail: రేప్‌ కేసులో శ్రీలంక క్రికెటర్‌ గుణతిలకకు బెయిల్‌

Gunathilaka granted bail: రేప్‌ కేసులో శ్రీలంక క్రికెటర్‌ గుణతిలకకు బెయిల్‌

Hari Prasad S HT Telugu

17 November 2022, 15:19 IST

  • Gunathilaka granted bail: రేప్‌ కేసులో శ్రీలంక క్రికెటర్‌ గుణతిలకకు బెయిల్‌ మంజూరైంది. సిడ్నీ కోర్టు గురువారం (నవంబర్‌ 17) అతనికి కొన్ని షరతులు విధిస్తూ బెయిల్‌ ఇచ్చింది.

శ్రీలంక క్రికెటర్ గుణతిలక
శ్రీలంక క్రికెటర్ గుణతిలక (AFP)

శ్రీలంక క్రికెటర్ గుణతిలక

Gunathilaka granted bail: టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన శ్రీలంక క్రికెటర్‌ గుణతిలకకు బెయిల్‌ మంజూరు చేశారు. నవంబర్‌ 6వ తేదీ తెల్లవారుఝామున శ్రీలంక టీమ్‌ తిరుగు ప్రయాణమైన తర్వాత గుణతిలకను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనిపై రేప్‌కు సంబంధించిన నాలుగు అభియోగాలను మోపారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

29 ఏళ్ల ఓ మహిళ ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్‌ చేశారు. బెయిల్‌ ఇవ్వడానికి సిడ్నీ కోర్టు నిరాకరించడంతో అప్పటి నుంచీ అక్కడి జైల్లోనే ఉన్నాడు. న్యూసౌత్‌వేల్స్‌ పోలీసుల కథనం ప్రకారం నవంబర్‌ 2వ తేదీన తనకు డేటింగ్‌ యాప్ ద్వారా పరిచయమైన సదరు మహిళను గుణతిలక రేప్‌ చేశాడు. ఆమె ఫిర్యాదు మేరకు 6వ తేదీన అరెస్ట్‌ చేశారు.

అయితే తాజాగా గురువారం (నవంబర్ 17) సిడ్నీ కోర్టు గుణతిలకకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇప్పటికే శ్రీలంక క్రికెట్‌ అతన్ని సస్పెండ్‌ చేసింది. సిడ్నీలోని పార్క్‌లియా జైల్లో ఉన్న అతడు వీడియో లింక్‌ ద్వారా డౌనింగ్‌ సెంటర్‌ కోర్టు ముందు హాజరయ్యాడు. నవంబర్‌ 6 అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచీ గుణతిలక పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో సదరు మహిళను కలిసిన గుణతిలక.. కొన్నాళ్లు పాటు ఆమెతో చాటింగ్‌ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుద్దామని నిర్ణయించారు. ఈ సమయంలోనే ఆమె అంగీకారం లేకుండా అతడు లైంగిక చర్య జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని షరతులపై ప్రస్తుతం అతనికి బెయిల్‌ మంజూరు చేశారు.

లక్షా 50 వేల ఆస్ట్రేలియా డాలర్లు, అక్కడి స్థానిక వ్యక్తి పూచీకత్తుతోపాటు అతని పాస్‌పోర్ట్‌ పోలీసులకు సరెండర్‌ చేయడం, ప్రతి రోజూ రెండుసార్లు పోలీస్‌ స్టేషన్‌కు రావడం, రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకూ బయట తిరగకూడదన్న నిబంధన, ఫిర్యాదుదారును ఎట్టిపరిస్థితుల్లోనూ కలవకూడదు, ఇక టిండర్‌లాంటి డేటింగ్‌ యాప్స్‌కు దూరంగా ఉండాలన్న షరతులు విధించారు. ఇప్పటికే అటు శ్రీలంక క్రికెట్‌ కూడా రిటైర్డ్‌ హైకోర్టు జడ్జ్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి దీనిపై విచారణ జరుపుతోంది.