Rape charges on Cricketers: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న ఆటగాళ్లు వీరే.. అక్తర్ నుంచి అమిత్ మిశ్రా వరకు?-rape charges on cricketers from makhaya ntini to shoaib akhtar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rape Charges On Cricketers From Makhaya Ntini To Shoaib Akhtar

Rape charges on Cricketers: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న ఆటగాళ్లు వీరే.. అక్తర్ నుంచి అమిత్ మిశ్రా వరకు?

Nov 09, 2022, 07:42 AM IST Maragani Govardhan
Nov 09, 2022, 07:42 AM , IST

  • Rape charges on Cricketers: ఆస్ట్రేలియా వేదికగా ఓ పక్క టీ20 ప్రపంచకప్ జరుగుతుంటే.. శ్రీలంక ఆటగాడు దనుష్క గుణతిలకపై అత్యాచార ఆరోపణలు రావడం యావత్ క్రీడా ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ.. దనుష్క గుణతిలక తనను అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసింది. దీంతో ఆస్ట్రేలియా పోలీసులు సదరు క్రికెటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు గానూ.. శ్రీలంక జట్టుతో పాటు అక్కడకు వెళ్లాడు గుణ తిలక. అయితే గాయం కారణంగా సూపర్12 మ్యాచ్‌ల్లో అతడు ఆడలేదు. అయితే ఇంతలోనే అతడిపై ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సర్వత్రా కలకలం రేగింది. లంక జట్టు బస చేస్తున్న హోటెల్ నుంచే నేరుగా సిడ్నీ పోలీసులు గుణ తిలకను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు ఆస్ట్రేలియాలో పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో గుణతిలకను అన్ని ఫార్మాట్ల నుంచి శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. గతంలోనూ కొంతమంది ఆటగాళ్లు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

Danushka Gunathilaka: శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలకపై తాజాగా ఓ మహిళ అత్యాచారం ఆరోపణలు చేసింది. ప్రస్తుత అతడు ఆస్ట్రేలియా పోలీసుల అదుపులో ఉన్నాడు.

(1 / 6)

Makhaya Ntini: దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మఖయా ఎంతిని 1999లో 22 ఏళ్ల యువతిని అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. టాయ్‌లెట్ గదిలో తనను అత్యాచారం చేశాడని సదరు యువతి ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో తనను తాను నిర్దోషి అని నిరూపించుకోడానికి ఎంతినికి చాలా కాలమే పట్టింది. దశాబ్ద కాలం పాటు పోరాటం తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చి దక్షిణాఫ్రికా తరఫున మళ్లీ ఆడాడు.

(2 / 6)

Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. 2005లో ఆస్ట్రేలియా పర్యటనలో ఓ మహిళ అతడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. దీంతో టీమ్ మేనేజ్మెంట్ అక్తర్‌ను ఆసీస్ పర్యటన నుంచి వెనక్కి పంపింది. అయితే అప్పట్లో ఈ విషయం పెద్దగా హైలెట్ కాలేదు. ఈ విషయాన్ని అక్తరే స్వయంగా ఓ ఛాట్ షోలో చెప్పాడు.

(3 / 6)

Rubel Hossain: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్‌పై కూడా 2015లో అతడి ప్రియురాలు అత్యాచార ఆరోపణలు చేసిది. పెళ్లి సాకుతో రూబెల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి తెలిపింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే అనంతరం ఆమె కేసు ఉపసంహరించుకోవడంతో అతడు నిర్దోషిగా బయటకు వచ్చాడు.

(4 / 6)

Amit Mishra: ఈ జాబితాలో టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఉన్నాడు. 2015లో మిశ్రాపై అతడి స్నేహితురాలు ఒకరు ఈ ఆరోపణలు చేసింది. తనను అమిత్ మిశ్రా లైంగిక వేధింపులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మిశ్రాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే అనంతరం కోర్టు అతడిని నిర్దోషిగా తేల్చింది.

(5 / 6)

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న కొెంతమంది క్రికెటర్లు వీరే

(6 / 6)

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న కొెంతమంది క్రికెటర్లు వీరే

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు