తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gambhir On Kohli World Record: సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీపై గంభీర్ షాకింగ్ రియాక్షన్.. ఏమన్నాడంటే?

Gambhir on Kohli World Record: సచిన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీపై గంభీర్ షాకింగ్ రియాక్షన్.. ఏమన్నాడంటే?

22 February 2023, 13:08 IST

    • Gambhir on Kohli World Record: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే 25 వేల అంతర్జాతీయ పరుగుల మార్కును అందుకుని సచిన్ రికార్డు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ రికార్డుపై గౌతమ్ గంభీర్ స్పందించాడు.
కోహ్లీ రికార్డుపై గంభీర్ రియాక్షన్ ఇదే
కోహ్లీ రికార్డుపై గంభీర్ రియాక్షన్ ఇదే

కోహ్లీ రికార్డుపై గంభీర్ రియాక్షన్ ఇదే

Gambhir on Kohli World Record: టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. రెండో టెస్టులో 44 పరుగులతో భారీ స్కోరు చేస్తాడనుకున్న కోహ్లీ.. అనూహ్యంగా టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. అంపైర్ తప్పిదం కూడా ఇందుకు కారణమైనప్పటికీ కోహ్లీ నుంచి మరో భారీ ఇన్నింగ్స్ దూరమయ్యేందనే చెప్పాలి. ఈ క్రమంలోనే విరాట్.. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే 25 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ గౌతమ్ గంభీర్ కూడా చేరాడు. కోహ్లీ అన్ని పరిస్థితుల్లోనూ విజయవంతమయ్యాడని అన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"నాకు లిస్టు గురించి తెలియదు. కానీ విరాట్ కోహ్లీ ఏ పరిస్థితుల్లోనైనా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నాడు. అది ఆస్ట్రేలియా గాని, సౌతాఫ్రిక పిచ్ ఏదైనా పర్ఫార్మెన్స్ మాత్రం ఒకేలా ఉంది. 25 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారిని ఉపఖండపు పిచ్‌ల్లో వారి పరుగులను పోలిస్తే తెలుస్తుంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో కోహ్లీ మాస్టర్. కానీ అతడు టెస్టుల్లోనూ 27 సెంచరీలు, 28 అర్ధశతకాలు చేశాడు. అదే విధంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ల్లోనూ పరుగులు చేశాడు. అంకంటే అతడు ఇంకేం సాధించాలి." అని కోహ్లీపై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

"25 వేల ఇంటర్నేషనల్ రన్స్ చేయడమంటే జోక్ కాదు. కోహ్లీ కెరీర్‌లో ఎన్నో ఎత్తు, పల్లాలను ఎదుర్కొన్నాడు. కానీ స్థిరంగా ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. ఆటగాళ్ల గేమ్‌లో ఎన్నో మార్పులు వస్తాయి. వారి వైఖరి మారుతుంది. టెక్నిక్ మారుతుంది. బలాలు, బలహీనతలు మారుతాయి. ఎమోషన్స్ మారుతాయి. వీటన్నింటినీ నియంత్రించే కలిగితే, ఇన్ని పరుగులు సాధించగలిగితే అప్పుడు గొప్పవారవుతారు." అని గంభీర్ అన్నాడు.

దిల్లీ వేదికగా జరిగిన మూడో టెస్టులో కోహ్లీ అరుదైన మైలు రాయి అందుకున్నాడు. వేగంగా 25 వేల ఇంటర్నేషనల్ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే సచిన్ పేరిట ఉన్న ఈ ఘనతను అధిగమించాడు. సచిన్ 577 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు సృష్టించగా.. కోహ్లీ 549 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్-588 ఇన్నింగ్స్‌ల్లో, జాకస్ కల్లిస్- 594 ఇన్నింగ్స్‌ల్లో కుమార సంగక్కర్-608 ఇన్నింగ్స్‌ల్లో మహేలా జయవర్దనే-704 ఇన్నింగ్స్‌ల్లో 25 వేల అంతర్జాతీయ పరుగులు రికార్డును అందుకున్నారు.