Kohli Stays At Home: హోటల్ రూమ్స్ కు ఫుల్ డిమాండ్; ఇంట్లోనే విరాట్ కోహ్లీ-team india s hotel changed virat kohli not staying with teammates ahead of delhi test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Stays At Home: హోటల్ రూమ్స్ కు ఫుల్ డిమాండ్; ఇంట్లోనే విరాట్ కోహ్లీ

Kohli Stays At Home: హోటల్ రూమ్స్ కు ఫుల్ డిమాండ్; ఇంట్లోనే విరాట్ కోహ్లీ

HT Telugu Desk HT Telugu
Feb 16, 2023 06:02 PM IST

Kohli Stays At Home: జీ 20 సదస్సుతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న ఫైవ్ స్టార్ హోటళ్లలో రూమ్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ

Kohli Stays At Home: జీ 20 సదస్సుతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న ముఖ్యమైన ఫైవ్ స్టార్ హోటళ్లలో రూమ్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దాంతో, ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్ట్ (second Test against Australia) కోసం ఢిల్లీ వచ్చిన ఇండియన్ క్రికెట్ టీమ్ (Indian cricket team) సభ్యులకు ఆ హోటల్స్ లో రూమ్స్ లభించడం కష్టమైంది.

Indian cricket team in Hotel Leela: క్రికెట్ టీమ్ ఇన్ లీలా హోటల్

సాధారణంగా, ఢిల్లీ లో క్రికెట్ టీమ్ (Indian cricket team) కు తాజ్ ప్యాలెస్ (Taj Palace) లో కానీ, ఐటీసీ మౌర్య (ITC Maurya) లో కానీ బస ఏర్పాటు చేస్తారు. కానీ, ప్రస్తుతం జీ 20 సదస్సు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా ఆ హోటల్స్ లో రూమ్స్ ఇప్పటికే బుక్ అయిపోయాయి. దాంతో, Indian cricket team సభ్యలకు ఈ సారి నోయిడాలోని హోటల్ లీలాలో రూమ్స్ బుక్ చేసింది బీసీసీఐ. ఈ హోటల్ కూడా బావుందని, సౌకర్యాలు అద్బుతంగా ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు వివరించారు.

Kohli Stays At Home: ఇంట్లోనే విరాట్ కోహ్లీ

ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టీమ్ మెంబర్స్ తో కలిసి హోటల్ లో కాకుండా, ఇంట్లోనే ఉంటున్నాడు. గురుగ్రామ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) కి సొంతంగా ఒక ఇల్లు ఉంది. దాంతో, టీమ్ మేనేజ్ మెంట్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని కోహ్లీ (Virat Kohli) హోటల్ రూమ్ నుంచి తన ఇంటికి వెళ్లాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ (second Test against Australia) ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 21 వరకు జరిగే ఈ టెస్ట్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ (Border-Gavaskar Trophy series) లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ తొలి టెస్ట్ (1st test) నాగపూర్ లో జరిగింది. ఆ టెస్ట్ ను ఇండియా ఇన్నింగ్స్ 132 పరుగుల ఆధిక్యంతో, గెల్చుకుని 1-0 లీడ్ లోకి వెళ్లింది. తొలి టెస్ట్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) 26 బాల్స్ ఆడి 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 81 పరుగులిచ్చి 7 వికెట్లు తీయడంతో పాటు, 70 రన్స్ చేసిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెల్చుకున్నారు.

WhatsApp channel