Kl Rahul - IND vs AUS 2nd Test: రెండో టెస్ట్ కోసం జాఫ‌ర్ అంచ‌నా వేసిన ఇండియా టీమ్ - రాహుల్ సూర్య‌కుమార్‌ల‌కు నో ప్లేస్‌-wasim jaffer picks his playing xi for india in delhi test no place for kl rahul in jaffer team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul - Ind Vs Aus 2nd Test: రెండో టెస్ట్ కోసం జాఫ‌ర్ అంచ‌నా వేసిన ఇండియా టీమ్ - రాహుల్ సూర్య‌కుమార్‌ల‌కు నో ప్లేస్‌

Kl Rahul - IND vs AUS 2nd Test: రెండో టెస్ట్ కోసం జాఫ‌ర్ అంచ‌నా వేసిన ఇండియా టీమ్ - రాహుల్ సూర్య‌కుమార్‌ల‌కు నో ప్లేస్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 16, 2023 09:37 AM IST

Kl Rahul - IND vs AUS 2nd Test: ఇండియా - ఆస్ట్రేలియా మ‌ధ్య రెండో టెస్ట్ శుక్ర‌వారం ప్రారంభంకానుంది. రెండో టెస్ట్ కోసం తాను అంచ‌నా వేసిన టీమ్‌ను వ‌సీమ్ జాఫ‌ర్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అత‌డి జ‌ట్టులో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే…

కె.ఎల్ రాహుల్‌
కె.ఎల్ రాహుల్‌

Kl Rahul - IND vs AUS 2nd Test: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా శుక్ర‌వారం నుంచి ఇండియా - ఆస్ట్రేలియా మ‌ధ్య రెండో టెస్ట్ జ‌రుగ‌నుంది. తొలి టెస్ట్‌లో అద్భుత విజ‌యాన్ని సాధించిన టీమ్ ఇండియా అదే జోరుతో రెండో టెస్ట్‌లో బ‌రిలో దిగ‌నుంది. అయితే మొద‌టి టెస్ట్‌లో ఓపెన‌ర్ కె.ఎల్ రాహుల్ విఫ‌లం కావ‌డం టీమ్ ఇండియాను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. మ‌రోసారి పేల‌వ ఫామ్‌ను కొన‌సాగించిన అత‌డు 71 బాల్స్‌లో 20 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

రెండో టెస్ట్‌లో రాహుల్‌ను ప‌క్క‌న‌పెట్టాలంటూ ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తోన్నారు. రాహుల్ స్థానంలో శుభ్‌మ‌న్‌గిల్‌ను తీసుకోవాలంటూ చెబుతున్నారు. రెండో టెస్ట్ తుది జ‌ట్టులో రెండు మార్పుల‌ను సూచించాడు మాజీ క్రికెట‌ర్ వ‌సీమ్ జాఫ‌ర్‌. ఢిల్లీ టెస్ట్ కోసం తాను అంచ‌నా వేసిన టీమ్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు వ‌సీమ్‌ జాఫ‌ర్‌.

అత‌డి టీమ్‌లో కె.ఎల్ రాహుల్‌తో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్‌ల‌కు చోటు ద‌క్క‌లేదు. రాహుల్ స్థానంలో గిల్‌, సూర్య‌కుమార్ యాద‌వ్ స్థానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల‌కు త‌న టీమ్‌లో చోటు ఇచ్చాడు. వ‌సీమ్‌జాఫ‌ర్ అభిప్రాయంతో క్రికెట్ ఫ్యాన్స్ ఏకీభ‌విస్తున్నారు.

రాహుల్‌ను త‌ప్పించ‌డ‌మే మంచిదంటూ కామెంట్స్ చేస్తున్నారు. గ‌త ఎనిమిది ఇన్నింగ్స్‌ల‌లో కె.ఎల్ రాహుల్ యావ‌రేజ్ కేవ‌లం 17.12 మాత్ర‌మే ఉంది. మ‌రోవైపు గ‌త ఏడు మ్యాచుల్లో నాలుగు సెంచ‌రీల‌తో శుభ్‌మ‌న్‌గిల్ జోరుమీదున్నాడు.

WhatsApp channel