తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Formula E Race Winners: ఫార్ములా ఈ విజేతలు వీళ్లే - రేసింగ్ పోటీల్లో సినీ క్రీడా ప్ర‌ముఖుల సంద‌డి

Formula e Race Winners: ఫార్ములా ఈ విజేతలు వీళ్లే - రేసింగ్ పోటీల్లో సినీ క్రీడా ప్ర‌ముఖుల సంద‌డి

11 February 2023, 20:15 IST

  • Formula e Race Winners: హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీల్లో జీన్ ఎరిక్ వెర్నె విజేత‌గా నిలిచాడు. ఫార్ములా ఈ రేసింగ్ పోటీల‌కు స‌చిన్‌, రామ్‌చ‌ర‌ణ్‌, య‌శ్ స‌హా ప‌లువురు సినీ క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

ఫార్ములా ఈ విన్నర్స్
ఫార్ములా ఈ విన్నర్స్

ఫార్ములా ఈ విన్నర్స్

Formula e Race Winners: హైద‌రాబాద్ వేదిక‌గా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో జీన్ ఎరిక్ వెర్నె విజేత‌గా నిలిచాడు. నిక్ క్యాసిడ్ రెండో స్థానంలో నిల‌వ‌గా ఆంటోనియో డీ కోస్టా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. జీన్ ఎరిక్ ఫార్ములా ఈ విజేత‌గా నిల‌వ‌డం ఇది మూడోసారి.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

మొత్తం 32 ల్యాప్‌ల‌లో జ‌రిగిన ఈ రేస్‌లో జాన్ ఎరిక్ ఎన‌ర్జీని సేవ్ చేసుకుంటూ ముందుగా ల‌క్ష్యానికి చేరుకున్నాడు. నెక్లెస్ రోడ్‌లో 2.8 కిలోమీట‌ర్ల‌తో ఏర్పాటు చేసిన ఈ స్ట్రీట్ స‌ర్క్యూట్ రేసులో 22 మంది రేస‌ర్లు పాల్గొన్నారు. దాదాపు గంట‌న్న‌ర పాటు ఈ రేస్ కొన‌సాగింది. జాగ్వ‌ర్ రేస‌ర్లు ఒక‌రిఒక‌రు ఢీకొట్ట‌డంతో రేసు మ‌ధ్య‌లో నుంచి నిష్క్ర‌మించారు. విన్న‌ర్స్‌కు కేంద్ర‌మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్రోఫీల‌ను ప్ర‌దానం చేశారు.

ఈ రేసుకు హాజ‌రైన ప్ర‌ముఖులు వీళ్లే...

ఇండియాలో తొలిసారి జ‌రిగిన ఫార్ములా ఈ రేసుకు ప‌లువురు సినీ రాజ‌కీయ క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు శిఖ‌ర్ ధావ‌న్‌, దీప‌క్ హుడా, య‌జువేంద్ర చాహ‌ల్ ఫార్ములా ఈ రేసును తిల‌కించారు.

రామ్‌చ‌ర‌ణ్‌, నాగార్జున‌, య‌శ్‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు రేసుకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. కేటీఆర్‌, రామ్ మోహ‌న్ నాయుడుతో పాటు ప‌లువురు మంత్రులు ఈ రేసును వీక్షించారు.